మోకాళ్లలో నొప్పి, వెన్నులో నొప్పి, ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అరికాళ్ళలో, కాళ్ల కండరాల్లో, మోకాళ్ళు నొప్పి, కీళ్లనొప్పి రావడం ఇవన్నీ కూడా ఈ లేపనంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గిపోతుంది. లేపనం ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ లేపనాన్ని మోకాళ్ళు, కీళ్లు శరీరంలో ఏ భాగంలో నొప్పి వస్తే అక్కడ అప్లై చేస్తే చాలు ఒక్కరోజు లోనే ఉపశమనం కనిపిస్తుంది. కీళ్ల నొప్పులు అంటే పెద్దవారిలో వస్తాయని అనుకుంటాం కానీ ప్రస్తుతం చిన్న పిల్లలకు, అన్ని వయసుల వారికి కీళ్ల నొప్పులు వస్తున్నాయి.
దానికి కారణం మన లైఫ్ స్టైల్, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు. ప్రస్తుతం అందరూ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పోషకాహారలోపం ఏర్పడుతుంది. జంక్ ఫుడ్, బయట ఆహారం తినడం వల్ల కూడా ఇలాంటి కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు లేపనం ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం. తయారుచేయడానికి కావాల్సిన మొదటి పదార్థం పసుపు. పసుపు యాంటిబయాటిక్ గానే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా కలిగి ఉంటుంది.
పసుపు వాపును తగ్గించి నొప్పులను కూడా తగ్గేలా చేస్తుంది. ఈ లేపనం కోసం కావలసిన రెండవ పదార్థం బెల్లం. దీనికోసం పాత బెల్లం మాత్రమే తీసుకోవాలి. మార్కెట్లో దొరికే పసుపు రంగు బెల్లం తీసుకోకూడదు. పాత బెల్లం మాత్రమే నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.లేపనం కోసం కావలసిన 3 పదార్థం పటికబెల్లం. ఏదైనా దెబ్బ తగిలిన చోట లేదా నొప్పి ఉన్న చోట పటికబెల్లం తో మసాజ్ చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. దీనికి కావాల్సిన నాలుగవ పదార్థం మెంతి పిండి. మెంతులు శరీరంలో నొప్పులను, వాపులను తగ్గించడానికి బాగా సహాయపడుతాయి.
ఒక కడాయి తీసుకుని దానిలో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ బెల్లం, ఒక స్పూన్ మెంతిపిండి, ఒక స్పూన్ పటిక బెల్లం వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి దానిలో కొంచెం వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. దగ్గరికి పేస్ట్ లాగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లార్చుకోవాలి అంటే పూర్తిగా చల్లగా ఉండకూడదు గోరువెచ్చగా ఉండాలి. ఈ లేపనాన్ని నొప్పి ఉన్న భాగంలో అప్లై చేసి గంట సేపు ఉంచాలి.
రాత్రి పడుకునేటప్పుడు రాసుకుంటే కనుక ఏదైనా పట్టి కట్టేసి ఉదయం లేవగానే కడగాలి. దీనిని గోరువెచ్చటి నీళ్లతో మాత్రమే కడగాలి. లేపనం అప్లై చేయగా మిగిలిన దాన్ని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు వేడి చేసుకొని వాడుకోవచ్చు. ఈ లేపనం మోకాళ్ళ నొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, అరికాళ్ళ నొప్పి, ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.