ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వల్ల ఈ సమస్య ప్రతి ఒక్కరికీ చాలా ఎక్కువగా ఉంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మనం మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ పెడుతూ ఉంటాము. వాటి తయారీలో అనేక రకాల కెమికల్స్ ఉపయోగిస్తారు. వాటిలో ఉండే కెమికల్స్ వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంట్లో ఉండే వాటితో ఈజీగా మన జుట్టు రాలడం తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగే విధంగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం ప్రతి రోజూ ఉపయోగించే నూనె బౌల్లో మీ జుట్టుకి సరిపడినంత వేసుకోవాలి.
దీనిలో ఒక చెంచా అవిస గింజలు వేసుకోవాలి. అవిస గింజలులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరగడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. తర్వాత మనం ఒక కలబంద మట్ట తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి లోపల ఉండే జెల్ మాత్రమే తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా కలుపుకున్న నూనె, అవిసె గింజలు వేసిన బౌల్ లో ఈ జెల్ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ నూనె డబల్ బాయిలర్ పద్ధతిలో వేడి చేసుకోవాలి. ఈ విధంగా పది నిమిషాల పాటు వేడి చేసుకోవాలి.
తర్వాత నూనె గోరు వెచ్చగా ఉన్నపుడే వడకట్టుకోవాలి. ఈ వడకట్టుకున్న నూనె జుట్టు కుదుళ్ళ నుండి చివర్లు వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 5 నుండి 10 నిముషాల పాటు మసాజ్ చేసుకోవాలి. మస్సాజ్ చేసుకోవడం వలన బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరిగి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నూనె తల స్నానం చేయడానికి ముందు రోజు రాత్రి అప్లై చేసుకోవాలి. ఉదయం హోమ్ మేడ్ షాంపూ తో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
ఈ నూనెను అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నాకు జుట్టు చాలా ఎక్కువగా రాలిపోతుంది అనుకునేవారు ఒకసారి ట్రై చేసి చూడండి జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.