చాలామంది జుట్టు చాలా పల్చగా ఉందని బాధపడుతూ ఉంటారు. దీని కోసం హాస్పిటల్ చూట్టు తిరుగుతూ కెమికల్స్ గల ఆయిల్స్ ఉపయోగిస్తూ వాటి ఎఫెక్ట్ వలన సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రెమిడి వలన మీ జుట్టు చాలా ఒత్తుగా పొడవుగా ఎదుగుతుంది. ఇందులో ఉపయోగించేవి అన్ని ఇంట్లో లభించేవి కనుక చిన్న వారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక స్త్రీ పురుషులు ఎవరైనా ఉపయోగించవచ్చు.
ఇప్పుడు ఈ రెమిడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం దీనికోసం ముందుగా మెంతులను తీసుకొని మెత్తని పొడి లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక స్పూన్ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఒక నిమ్మ చెక్కను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఎటువంటి నీరు ఉపయోగించకూడదు.
ఇలా తయారు చేసిన పేస్ట్ ను ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోగ వచ్చిన జ్యూస్ ను రెండు స్పూన్లు మెంతుల పొడి ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టాలి. ఇలా చేయడం ద్వారా మెంతుల పొడిలో ఉన్న రసాయనాలు జ్యూస్ లోకి దిగుతాయి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ బాదం నూనె వేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇంకొకసారి అడగట్టుకోవాలి. ఇలా ఒక వడకట్టుకోకు వచ్చిన మిశ్రమాన్ని ఏదైనా సీసాలోకి లేదా స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మన జుట్టుకు ఏదైనా డ్రాపర్ లేదా స్ప్రే బాటిల్ సహాయంతో కుదుళ్ల నుంచి అప్లై చేయాలి.
ఈ మిశ్రమాన్ని ఆయిల్ లేదా డ్రై హెయిర్ కు అప్లై చేయవచ్చు. ఇందులో ఉపయోగించిన మెంతులు జుట్టును ఒత్తుగా చేయడంతోపాటు హెయిర్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు రసంలో ఉండే కెమికల్స్ వలన మన జుట్టు కుదుళ్ళ నుంచి స్ట్రాంగ్ అవుతుంది. నిమ్మరసం చుండ్రు నుంచి అందిస్తుంది. బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ జుట్టుని స్ట్రాంగ్ గా చేసి నల్లగా ఉండేలాగా చేస్తుంది…. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి..