ఈరోజు ఒక ఎఫెక్టీవ్ హెయిర్ సీరం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సీరంను ఉపయోగించడం వలన మన హెయిర్ గ్రోత్ రెండింతలు పెరుగుతుంది. మరియు జుట్టు రాలే సమస్య నుంచి విడుదల ఇస్తుంది. హెయిర్ ఫాల్ అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మన చెడు ఆహారపు అలవాట్లు మరియు పెరుగుతున్న పొల్యూషన్ వల్ల కూడా జుట్టు రాలటం ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా డాండ్రఫ్ వలన కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది.
కొన్ని రీసెర్చ్ ప్రకారం పది మందిలో 8 కి పైగా హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారు. అందువలన ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో మన జుట్టు సంరక్షించుకోవడం చాలా అవసరం. ఇప్పుడు నేను చెప్పే చిట్కా దీనికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి మన ఇంట్లోనే ఉపయోగించే మూడు పదార్థాలు అవసరం పడతాయి. అవి 1. వెల్లుల్లిపాయలు. వీటిలో మెగ్నీషియం, పొటాషియం మరియు విటమిన్ బి 6 మన హెయిర్ గ్రోత్ కిబాగా ఉపయోగపడతాయి. దీనికోసం 12 వెల్లుల్లి రెమ్మలు కావాలి.
2. ఉల్లిపాయ. మనకు మార్కెట్లో అనేక రకాల ఉల్లిపాయలు దొరుకుతాయి వాటిలో రెడ్ ఉల్లిపాయలను ఈ సీరం కు ఉపయోగించాలి. దీనిలో నాచురల్ సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలను, ఉల్లిపాయలను కలిపి ఒక బౌల్లో తీసుకోవాలి. 3.మెంతులు. వీటిలో విటమిన్ కె డి1, డి 12, సి లు ఎక్కువగా ఉంటాయి. వీటివలన హెయిర్ రాలడం మరియు చుండ్రు సమస్యలనుంచి విడుదల అందిస్తుంది. ఇప్పుడు ఈ సీరం ను తయారు చేసుకుందాం.
ముందుగా 3 స్పూన్ల మెంతులు ఒక గిన్నెలో తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తో ముందు రోజు రాత్రి నానబెట్టాలి. ఇలా నాన్న పెట్టడం వలన మెంతుల్లోని పొషకాలు అన్నీ నీటిలోకి దిగుతాయి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు మరియు ఉల్లిపాయలు ఒక మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిన మిశ్రమాన్ని వడకట్టు లేదా గుడ్డ సహాయంతో వడకట్టుకుని ఆ రసమును తీసుకోవాలి. ఈ రసంను మూడు స్పూన్లు మెంతులు నానపెట్టిన నీటిలో వేసుకొని కలుపుకోవాలి. దీనికి ముందుగా మెంతులు కలిపిన నీటిని వడకట్టుకోవాలి. ఈ రెండింటిని రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపాలి.
ఇలా తయారైన సీరం ను డ్రై హెయిర్ కు ముందు రోజు రాత్రి అప్లై చేసుకోవాలి. తర్వాత రోజు ఉదయం ఏదైనా మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మనం హెయిర్ ఫాల్ నుంచి విడుదల పొందవచ్చు మరియు హెయిర్ గ్రోత్ రెండింతలు పెరుగుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి…