శరీరంలో ఐరన్ లోపం ఏర్పడితే అది రక్తహీనతకు కారణమవుతుంది . రక్తహీనత వలన ఎదిగే పిల్లల్లో మరియు స్త్రీలలో గర్బాశయ,బుతు సంబంధ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా పెద్దవారిలో, మగవారిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అలసట, బలహీనత, లేత లేదా పసుపురంగు చర్మం, క్రమరహిత హృదయ స్పందనలు, శ్వాస ఆడకపోవుట, మైకము లేదా తేలికపాటి తలనొప్పి, ఛాతి నొప్పి,చల్లని చేతులు మరియు కాళ్ళు వంటి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
వీటిని తగ్గించుకోవడానికి మనం ఇప్పుడు ఒక చిట్కాని తెలుసుకోబోతున్నాం. దాని కోసం ఉపయోగించే పదార్థాలు అక్రూట్ లేదా వాల్ నట్స్. ఇవి ఇప్పుడు అన్ని రకాల సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఈ డ్రైఫ్రూట్స్ లో మెదడు ఆరోగ్యానికి, శరీరంలో ఐరన్ లోపం ని తగ్గించే గుణం అధికంగా ఉంటుంది. దీనిలో ఇనుము ఖనిజం పుష్కలంగా లభించి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. తర్వాత పదార్థం నువ్వులు.
నువ్వులలో కూడా ఐరన్ క్యాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీనికోసం తెల్ల నువ్వులు తీసుకోవాలి. నువ్వుల గింజలు అద్భుతమైనట్టి రుచిని కలిగి ఉంటాయి మరియు ఇనుము యొక్క గొప్ప మూలం ” ఈ విత్తనాలలో కొంత ఇనుము ఉంటుంది – ఒక టేబుల్ స్పూన్‌కు 1.31 మి.గ్రా, USDA ప్రకారం – మరియు రాగి వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. అంతేకాదు, వాటిలో భాస్వరం, విటమిన్ ఇ మరియు జింక్ ఉంటాయి.
అలాగే మరొక పదార్థం బెల్లం. మనం ఈ చిట్కా కోసం నల్ల బెల్లం లేదా తాటి బెల్లం తీసుకోవాలి. పంచదార లేదా పట్టిక బెల్లం ఉపయోగించకూడదు. తర్వాత వీటిని అర కప్పు ఆక్రూట్, అరకప్పు నువ్వులు. వాటికి సరిపడా బెల్లం తురుముకొని మిక్సీలో మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని దీనికి ఒక స్పూన్ ఆవు నెయ్యి కలుపుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి. ఈ లడ్డూలను రోజుకు ఒకటి తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గి రక్తహీనత సమస్య తగ్గించబడుతుంది.
స్త్రీలలో అనేక రకాల రుతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. పిల్లలలో ఎదుగుదల చక్కగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇలా కొన్ని రోజులపాటు ఈ లడ్డూలను తీసుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.