యుక్త వయసులో అబ్బాయిలు, అమ్మాయిలు తీవ్రమైన మానసిక, శారీరిక ఒత్తిళ్ళకి గురోవుతున్నారు. ఒక పక్క చదువు ఒత్తిడి, మరోపక్క అధిక బరువు లేక ఊబకాయం వలన వస్తున్న ఒత్తిడి. తినే ఆహారం మీద శ్రద్ధ పెట్టకపోవడం, అటు తల్లితండ్రులు కూడా సరైన శ్రద్ధ తమ పిల్లల పట్ల చూపించకపోవడం..వయసుకి మించిన బరువు పెరిగిపోవడం.. భవిష్యత్తులో ఇదే బరువు తీవ్రమైన రోగాలకు దారి తీస్తుంది. యుక్త వయసులోనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, కొన్ని చిట్కాలు పాటిస్తే.. బరువు కచ్చితంగా తగ్గొచ్చు.
తల్లితండ్రులు బాధ్యత వహించాలి: తమ పిల్లలు తినే ఆహారాన్ని నియంత్రిస్తూ, పోషక విలువలు కలిగిన కూరగాయలు, పండ్లు.. నట్స్, వంటివి పెట్టాలి. వారికి గుడ్ ఫుడ్స్ అండ్ బాడ్ ఫుడ్స్ మీద అవగాహన కలిగించాలి. బరువుతో వచ్చే ఇబ్బందుల గురుంచి వివరించాలి. పిల్ల్లలని ఇతరులతో పోల్చకుండా..వారి శరీర ఆకృతిని విమర్శించకుండా.. పాజిటివ్ మాటలతో ప్రోత్సహించాలి.
ఆరోగ్యకరమైన ఆహారమే తినాలి: బరువు తగ్గడానికి ఎలాంటి మ్యాజిక్ వాండ్ లేదు.. ఆరోగ్యకరమైన ఆహారము ఒక్కటే పరిష్కారం. ఐరన్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, విటమిన్ సి నిండిన పండ్లు, ఆకుకూరలు, అలానే మాంసాహారం తినాలి. ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్లు, మరియు నూనెలో వేయించిన పదార్ధాలను తినడం పూర్తిగా మానెయ్యాలి. అలానే స్వీట్లు, కూల్డ్ డ్రింక్స్, ఎయిరేటెడ్ డ్రింక్స్, సోడా వంటి వాటి జోలికి పోనేకూడదు. చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ని వీలైనంత తీసుకోకపోవడమే మంచిది. కార్బోహైడ్రేట్స్ తో నిండి ఉన్న అన్నాన్ని పూర్తిగా మానివేయకుండా.. తక్కు మోతాదులో తీసుకుంటే బరువు కచ్చితంగా తగ్గుతారు.
- దీని ముందు ఖరీదైన ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ పనిచేయదు
- రాత్రి పూట ఇలా చేస్తే వద్దన్నా మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది
వ్యాయామం… విశ్రాంతి: కేవలం ఆహార నియంత్రణ పాటిస్తే సరిపోదు. యువతి, యువకులు వ్యాయామం చేయాలి. ఏరోబిక్స్, కార్దియో, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేస్తే తప్పక బరువు తగ్గి హుషారుగా ఉంటారు. ఒక అరగంట నుంచి గంట వరకు వాకింగ్ చేస్తే ఫలితాలు మరింతగా కనిపిస్తాయి. అయితే.. బరువు తగ్గాలనుకుంటే వ్యాయామంతో పాటుగా విశ్రాంతి చాల అవసరం. వ్యాయామంతో శరీరం ఒత్తిడికి గురవుతుంది, అలానే అలసట, నీరసం వస్తుంది. విశ్రాంతి తీసుకుంటే, శరీరం తేలికపడుతుంది. ఏడు – ఎనిమిది గంటల నిద్ర యువతలకు అత్యవసరం.
ఈ చిన్న చిన్న విషయాలను శ్రద్ధగా ఆచరిస్తే.. బరువు తగ్గి, ఆరోగ్యమైన శరీరం మీ సొంతం చేసుకుంటారు.. అయితే, వీటిని పాటించే ముందు వైద్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోండి.