how to prepare ancient bath powder sunnipindi

మన పెద్దలు వాడిన గొప్ప సౌందర్య సాధనం ఇదే………

అందమనేది స్వతహాగానూ సహజత్వంగానూ వస్తుంది, రసాయనాలు వాడి ముఖాన్ని మెరిపించినంత మాత్రానా అది దీర్ఘ కాలం ఉండదు పైగా దానివల్ల ఉన్న ముఖంలో కళ పోయి చర్మ రంద్రాలు మూసుకుపోయి ముఖమంత మొటిమలతో అందవిహీనంగా తయారవుతారు.అంతే కాదు ముఖానికి మేకప్ లేకపోతే మనల్ని మనం ఇష్టపడటం కూడా తగ్గుతుంది. ఇలాంటి రసాయనాలు అన్ని ఇప్పటి తరంకే కానీ ఒకప్పుడు మన పెద్దలు వారి ఉపయోగంలో ఇలాంయి రసాయనాలు ఉండేవి కాదు. అయినా వారి అందం అద్భుతం. మరి అంతటి అద్భుతమైన అందానికి వారు ఉపయోగించినది ఏమిటి అని విశ్లేషిస్తే వాళ్ళు ఉపయోగించినది మనం ఫ్యూరం పెట్టినది ఒకటే. అదే సున్నిపిండి. 

అనుకోవడానికి ఆశ్చర్యమేస్తుంది కానీ సున్నిపిండి ఔషధ గుణాలు నింపుకున్న అద్భుతమైన సౌందర్య సాధనం.

మరి సున్నిపిండి కథ ఏంటి??  అది మనకు ఏవిధంగా దోహదపడుతుంది తెలుసుకోవాల్సిందే.

◆ ఇప్పట్లో సున్నిపిండి గూర్చి తెల్సిన వారు చాలా తక్కువ. వేగం పెరిగిన ఈ కాలంలో సున్నిపిండి తో ఓపికగా ఒళ్ళు రుద్దుకుని స్నానం చేసే వారు చాలా తక్కువ. పైన రంగురంగుల మరియు వివిధ రకాల సువాసనలతో బోలెడు సబ్బులు అందుబాటులోకి వచ్చాక సున్నిపిండి విలువను మరిపోతున్నాం కూడా.

◆ శరీరాన్ని పోషించడంలో, చర్మానికి చక్కని రంగు తీసుకురావడంలో సున్నిపిండి అద్భుతంగా పనిచేస్తుంది. సున్నిపిండితో రోజు ఒళ్ళు రుద్దుకుని స్నానం చేస్తే చర్మం ముడతలు పడటం, పగుళ్లు రావడం, జిడ్డుగా ఉండటం వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

◆ సున్నిపిండిని నీళ్లలో కలిపి కాసింత చిక్కటి  మిశ్రమంగా చేసి వాడుకుంటే  బొల్లి వ్యాధి రాకుండా అరికట్టవచ్చు.

◆ చర్మంలో స్వేదగ్రంధులలో మార్పు వలన మెదడులో నాడీకేంద్రాల మార్పు వలన, కొందరికి చర్మం పైన 100 డిగ్రీల జ్వరం ఉన్నట్టు ఉండి శరీరానికి తగినంత చెమట పట్టకుండా చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సమస్యలో ఉన్నపుడు వైద్యుడు సూచించిన మందులు వాడుతూనే సున్నిపిండిని రోజూ ఉదయం మరియు సాయంత్రం వాడుతుంటే మంచి ఫలితం ఉంటుంది. నలుపు రంగు ఉన్నవారు సున్నిపిండిని దీర్ఘకాలికంగా వాడుతూ ఉంటే క్రమంగా మంచి రంగులోకి వస్తారు.

◆ సులువైన రీతిలో సున్నిపిండి తయారుచేసుకోవాలి అనుకున్నప్పుడు పెసలు, బావంచాలు, ఖర్జూరాలు, పసుపు మొదలైనవి సేకరించుకుని మెత్తగా మరపట్టించి వాడుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకు కూడా వాడచ్చు. అయితే ఇందులో పెసలు ఎక్కువగానూ, మిగిలినవి అన్ని ఒకే పరిమాణంలో కొలత తీసుకుని తయారుచేసుకోవాలి.

◆ సున్నిపిండిలో పెసలు చర్మానికి మృధుత్వాన్ని, తేమను అందిస్తాయి కాబట్టి ఇది సహజ మాశ్చరైజింగ్ గా పనిచేస్తుంది.

◆ బావంచాలు సూర్యుని  వేడితో రసాయన క్రియ జరిపే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి సున్నిపిండిని ఒంటికి పట్టించుకున్న తరువాత ఎక్కువసేపు అలాగే ఉండకూడదు. ఒకవేళ ఎక్కువసేపు అలాగే ఉంటే చర్మం గాఢతకు లోనై కందిపోవడం, పగుళ్లు రావడం, మంట పెట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి నాలుగు పెట్టుకున్న వెంటనే  స్నానం చేయాలి.

◆ ఖర్జురాలు చర్మానికి మంచి రంగును ఇవ్వడంలో మరియు చర్మానికి కావలసిన పోషకాలు అందించడంలో గొప్పగా సహాయపడతాయి. 

◆ పసుపు గొప్ప యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ అనే విషయం అందరికి తెలిసినదే. దీన్ని సున్నిపిండిలో చేర్చుకోవడం వల్ల చర్మం మీద ఉన్న గుల్లలు, మచ్చలు, అన్ని రకాల చర్మసంబంధ వ్యాధులను మాన్పుతుంది.

◆ ఏక్కువగా చెమట పట్టడం,  చెమట దుర్వాసనతో కూడి ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఈ సున్నిపిండి ఉపయోగించి మంచి ఫలితాలను పొందవచ్చు.

చివరగా…..

మన పెద్దలు ఒకప్పుడు  వాడుకున్న ఈ సున్నిపిండిని తిరిగి వాడటం మొదలుపెట్టవలసిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే అందమనేది సహజంగా పొందవలసినది కాబట్టి.

Leave a Comment

error: Content is protected !!