how-to-prepare-calcium-increase-drink-at-home

రక్తాన్ని తయారుచేసే ఈ పండును తింటే రక్తహీనత రాకుండా 100 ఏళ్ళు గ్యారంటీగా బ్రతుకుతారు..anemia juice

బీట్రూట్ దుంప కూరల్లో మంచిరంగుతో ఆకర్షించే కూరగాయ. ఎర్రగా జ్యూస్ చేసుకున్నా చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే బీట్రూట్ ని ఆరోగ్యం కోసం ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. బీట్రూట్ చాలామంది తినడానికి ఇష్టపడరు. దీనిని చిన్నవైతే రెండు, పెద్దవైతే ఒకటి తీసుకోవాలి. పైన చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. బీట్రూట్లో చాలా ప్రయోనాలు ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. ఐరన్ తక్కువగా ఉంటే రక్తహీనత కు గురవుతారు. బీట్రూట్ జ్యూస్ రోజూ తాగితే ఐరన్ పెరుగుతుంది.  రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి ఎనీమియా వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

ముక్కలుగా తరిగిన బీట్రూట్ ని కొంచెం నీటిని కలిపి మిక్సీలో జ్యూస్ లా చేసుకోవాలి. నీరసంతో బాధపడేవారు ఇలా జ్యూస్ చేసుకుని తాగితే నీరసం తగ్గిపోతుంది. దీంట్లో పంచదార వేసుకోకూడదు. పంచదార వలన దుష్ప్రభవాలు తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. తియ్యదనం కోసం కావాలంటే తేనె కలపచ్చు. నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. చర్మం రంగు కోసం ఇందులో ఒక క్యారెట్, ఒక టమోటా వేసి జ్యూస్లా చేసుకోవాలి. దీనివలన మంచి రంగు వస్తుంది. ఈ జ్యూస్లో ఏమీ కలపకపోయినా మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎలా తీసుకున్న రుచి బాగానే ఉంటుంది. బీట్రూట్ లో శరీరానికి కావలసిన విటమిన్ ఇ, సి ఎక్కువగా ఉంటాయి. ఇవి బీ.పీ తగ్గడానికి సహకరిస్తాయి. 

బీట్రూట్ లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పొటాషియం ప్రతి మనిషికి చాలా అవసరం. ఇలా వారానికి రెండు సార్లు తీసుకున్నా గుండెకు చాలా మంచిది. శరీరంలో ట్రైగ్లిజరాయిడ్స్ ను తొలగిస్తుంది. ట్రై గ్లిజరాయిడ్స్ తగ్గడం వలన అధిక కొవ్వు సమస్య కూడా తగ్గుతుంది. శరీరంలో హర్మనల్ ఉత్పత్తిని బీట్రూట్ పెంచుతుంది. అధికబరువు సమస్య కూడా తగ్గుతుంది. గర్బిణీ మహిళలకు ఈ బీట్రూట్ చాలా మంచిది. వారికి కావలసిన ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది. గర్భంలోని పిండం పెరుగుదలకు రోజూ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. చర్మసంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా బీట్రూట్ జ్యూస్ చాలా మంచిది.  పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శరీరంలో రక్తవృద్ధిని పెంచి శారీరకంగా బలంగా ఆరోగ్యం గా ఉండేలా దోహదపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!