How to Prepare Cheese at Home Reduces Weight

చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి అధిక బరువు నుంచి విడుదల అందించే వజ్రాయుధం……. పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి…….. హై ప్రోటీన్స్ లభిస్తాయి…

బయట బేకరీ ఫుడ్స్ లో గాని, జంక్ ఫుడ్స్ లో గాని విపరీతంగా చీజ్ ఉపయోగిస్తున్నారు. ఇంట్లో కూడా చాలామంది చీజ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ చీజ్ను ఎక్కువగా ఉపయోగించడం వల్లన అనేక రకాల నష్టాలు మనకు కలుగుతాయి. అలాంటి పాలతో చేసే చీజ్, సాల్టేడ్ చీజ్ బదులుగా హెల్దీ చీజ్ మన ఇంట్లో ఎలా తయారు చేసుకోని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. బయట దొరికే 100 గ్రాముల చీజ్ తీసుకుంటే అందులో 350 క్యాలరీల శక్తి ఉంటుంది. ఫ్యాట్ 33 గ్రామ్స్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 47 గ్రామ్స్‌.

                        ప్రోటీన్ 22 గ్రామ్స్, సోడియం 653 మిల్లీగ్రామ్స్, నీటి శాతం 38 గ్రామ్స్, కాల్షియం 750 మిల్లీగ్రామ్స్, ఇది చీజ్ లో ఉండే స్థూల, సూక్ష్మ పోషకాలు. ఇందులో క్యాలరీస్ 350 గ్రాములు కాబట్టి త్వరగా బరువు పెరగడానికి కారణం అవుతుంది. ముఖ్యంగా ఇందులో 33 గ్రాముల ఫ్యాట్ ఉంది. ఇదంతా సాచ్యురేటడ్ ఫ్యాట్. దీనివలన రక్తంలో ట్రైగ్లీజరీన్స్ ఎక్కువ అవుతాయి. అలాగే ఎల్ డి ఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. ‌ అంతేకాకుండా ఇందులో చాలా ఎక్కువ సోడియం ఉంటుంది. అందువలన బీపీ పెరగడానికి కారణం అవుతుంది.

                 ఇందులో ఫైబర్ లేకపోవడం వలన బ్యాడ్ బ్యాక్టీరియా ఉత్పత్తి పెరిగి గూడ్ బాక్టీరియా ఉత్పత్తి తగ్గిస్తుంది. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఎముకలు గుళ్ల భారిపోవడానికి కారణం అవుతాయి. అంతేకాకుండా దీనివలన అధిక బరువు, స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ కాకా పీరియడ్స్  ఇర్రెగ్యులర్ గా రావడం, నీటి బుడగలు, ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. మైగ్రేన్ తల నొప్పి రావడానికి కూడా ఇది ఒక కారణం. ఇన్ని రకాల సమస్యలు చీజ్  వలన వస్తున్నాయి. కాబట్టి బయట కోనేవి ఉపయోగించకపోవడం మంచిది.

                 హెల్దీగా మన ఇంట్లో జీడిపప్పు తోను, సోయాబీన్ తోను, కొబ్బరి పాలతోనూ, బాదంపప్పుతోను తయారు చేసుకోవచ్చు. వీటిని 10,12 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పాలను తీయాలి. ఇలా వచ్చిన పాలకు కొద్దిగా హాట్ వాటర్, రెండు స్పూన్ల ఆగార్ ఆగార్, రెండు స్పూన్ల ఈస్ట్, ఆ స్పూన్ లెమన్ జ్యూస్, కొద్దిగా రుచి కోసం వెల్లుల్లి పేస్ట్ లేదా వెల్లుల్లిపాయలను కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఆరు నుంచి పది నిమిషాలు పొయ్యిమీద బాయిల్ చేయాలి. ఇలా మరిగిన తర్వాత చల్లార్చి ఫ్రిజ్లో పెట్టాలి. ఇలా చేసుకోవడం ద్వారా హెల్ది చీజ్ మన ఇంట్లోనే తయారవుతుంది…

Leave a Comment

error: Content is protected !!