మనం తీసుకుంటున్న ఆహారం వాతావరణం మొత్తం కలుషితమే నేటి కాలంలో. నేటి వ్యవసాయ పద్ధతులు, ఆహారం నిల్వ చేసే విధానం కూడా మన శరీరం మొత్తం వ్యవస్థకు నష్టం కలిగించే రసాయనాల ద్వారా నీ జరుగుతోంది. రోజువారీ మనకు కావలసిన పోషకాలను నింపడానికి మరియు విషాన్ని తొలగించడానికి, ప్రతిఒక్కరూ ఎన్నో లరాయత్నాలు చేస్తుంటారు. అయితే మనం రోజువారీ తీసుకునే ఒక ప్రత్యేక పద్దతి ద్వారా దీన్ని తొందరగా సులువుగా చేయవచ్చని మీకు తెలియదు. . శరీరం నుండి హానికరమైన విషాన్ని బయటకు పారద్రోలడానికి అత్యంత సాధారణమైన మరియు సులభమైన మార్గం ఏమిటంటే, పగటిపూట ఎక్కువ నీరు తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడం. అయితే ఇది మాములు నీటి ద్వారా కాకుండా వివిధ పోషకాలు నింపబడిన డిటాక్స్ నీటిని తాగడం ద్వారా గొప్ప ఫలితాన్ని పొందవచ్చని సమాచారం. మరి ఈ డిటాక్స్ వాటర్ ఏమిటి?? ఎలా పని చేస్తుంది?? ఎలా తాగాలి చదవండి మరి.
డిటాక్స్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి.
ఒక పెద్ద గాజు సీసా లేక బాటల్ లో లీటర్ నుండి రెండు లీటర్ల నీటిని పోయాలి. అందులో గుండ్రంగా తరిగిన కీరా దోస చక్రాలు, నిమ్మకాయ చక్రాలు, ఒక అంగుళం అల్లం, 5 నుండి 10 పుదీనా ఆకులు వేయాలి. దీనిని రాత్రిపూట వేసి ఉదయం వరకు అలాగే ఉంచాలి. ఉదయాన్నే బాటల్ లో వేసిన వాటిని తొలగించి నీటిని జాగ్రత్త చేసుకోవాలి. పరగడుపున ఈ నీటితో మన దినచర్య మొదలు పెట్టాలి. రోజులోపు నీటిని తాగేయ్యాలి.
డిటాక్స్ వాటర్ ఎందుకు తీసుకోవాలి.
మనం శరీరంలో అంతర్గతంగా నిండిన టాక్సిన్( విషపదార్థాలు) లను విచ్చిన్నం చేయడానికి మరియు బయటకు పంపడానికి సహకరించే నీటిని డిటాక్స్ వాటర్ అంటున్నాము. డిటాక్స్ వాటర్ తీసుకోవడం ద్వారా ఈ నీటి ప్రభావం కాలేయంతో మొదలై ఊపిరితిత్తులు మరియు గట్ వంటి ఇతర అవయవాలలో నెమ్మదిగా పనిచేస్తుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపడం ద్వారా మన మొత్తం ఆరోగ్యాన్ని సమగ్రంగా నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది.
డిటాక్స్ వాటర్ ప్రయోజనాలు ఏమిటి.
◆ దోసకాయ నిమ్మకాయ డిటాక్స్ నీటిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇది తయారు చేయడం చాలా సులభం మరియు రుచిని కలిగి ఉంటుంది. ఈ నీటిలో దోసకాయ మరియు నిమ్మకాయ రెండింటి యొక్క పోషకాలను నింపుకుని ఉంది. ఇవి రెండూ కూడా బరువు తగ్గించే లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. వీటి కలయిక నిజంగా ప్రభావవంతంగా ఉంటుంది మరియు క్రమం తప్పకుండా తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఫలితాలను చూడవచ్చు.
◆ఇది ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరాన్ని శుభ్రపరుస్తుంది. తద్వారా జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. దోసకాయ ఆరోగ్యకరమైన జీర్ణ ఎంజైమ్‌లతో నిండి ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీటిని తీసుకోవడం ద్వారా మన రోజును ప్రారంభించవచ్చు.
◆నిమ్మకాయ మరియు దోసకాయ రెండూ చర్మాన్నీ ఆరోగ్యంగా ఉంచుతాయి. , ఈ డిటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల కాంతివంతమైన మరియు హైడ్రేటెడ్ చర్మాన్ని పొందవచ్చు.
◆నీటితో పాటు ఈ రెండింటిలో ఉన్న ఎంజైమ్‌లు మొహం మీద ఉన్న మొటిమలు, మచ్చలు, కురుపులు వంటి వాటిని తగ్గించడంలో తోడ్పడతాయి. ముఖాన్నితాజాగా కనిపించేలా చేసి ముఖారవిందాన్ని అందిస్తాయి.
◆ముఖ్యంగా వేసవికాలంలో ఈ డిటాక్స్ నీరు అద్భుతంగా ఉపయోగపడుతుంది! తొందరగా అలసిపోకుండా శక్తినిచ్చేలా రోజంతా ఈ డిటాక్స్ పానీయాన్ని తీసుకోవచ్చు.
◆ఇది మీ ఎలెక్ట్రోలైట్స్ బ్యాలెన్స్‌ను కంట్రోల్ లో ఉంచుతుంది. ఈ డిటాక్స్ వాటర్ జీవక్రియను పెంచే పోషకాల మూలాలతో నిండి ఉంటుంది కనుక రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల తొందరగా ఆకలి వేయదు. అందువల్ల బయటి జంక్ ఫుడ్ కు మీకు తెలియకుండానే దూరమవుతారు.
◆నిమ్మకాయ విటమిన్ సి తో నిండి ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్స్ లను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
◆దోసకాయ నిమ్మకాయ మాత్రమే కాకుండా వీటిలో అల్లం, పుదీనా ఆకులు జోడించడం వల్ల తయారేయ్యే డిటాక్స్ వాటర్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అతిదాహాన్ని తీర్చడమే కాకుండా, జిహ్వ చాపల్యాన్ని తగ్గిస్తుంది. పుదీనా సహజమైన చలువ గుణం కలిగి ఉంటుంది. ఇది సహజంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. తాజాదనాన్ని ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది కూడా.
చివరగా…..
సులువుగా తయారయ్యే ఈ డిటాక్స్ నీటిని ప్రతిరోజు రాత్రిపూట నిల్వచేసి ఉదయం నుండి రాత్రిలోపు తాగేయ్యాలి. అతిబరువుతో బాధపడేవారు, అతిదాహం వల్ల ఇబ్బంది పడేవారు ఈ నీటిని తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం పొందుతారు. మరి డిటాక్స్….. వాటర్ వైపు పరిగెడదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం పదండి.