how to prepare Instant Sambar Mix

ఇలా సాంబార్ పొడి చేసిపెట్టుకుంటే 10నిమిషాల్లో వేడి వేడి సాంబార్ రెడీ అయిపోతుంది

ప్రియమైన భోజన ప్రియులారా.. ఈ సాంబార్ పొడి ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10 నిమిషాల్లో వేడి వేడి సాంబార్ రెడీ అయిపోతుంది. మనం మామూలుగా సాంబార్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది అలా కాకుండా సాంబారు చాలా ఫాస్ట్ గా కావాలంటే మన ముందు గానే ఈ విధంగా సాంబార్ పొడి తయారు చేసి పెట్టుకోవాలి.

సాంబార్ పొడి తయారీ విధానం

  • ముందుగా గ్యాస్ ఆన్ చేసి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోండి.
  • అందులో 1 కప్పు కందిపప్పు ను వేసి మీడియం ఫ్లేమ్ బాగా వేయించుకోవాలి
  • కందిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు పెసరపప్పును వేసి వేయించుకోవాలి. పెసరపప్పు వేయడం వల్ల సాంబారు చాలా టేస్టీగా ఉండడమే కాదు సాంబారు చిక్కగా ఉంటుంది.
  • కందిపప్పు పెసరపప్పు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లో పక్కకు తీసి పెట్టుకోవాలి.
  • తర్వాత అదే పాన్ లో 2 టీస్పూన్లు ధనియాలు 3 లవంగాలు రెండు యాలకులు,  10-12 మిరియాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ప్లేట్ లో పక్కకు తీసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు  అదే పాన్ లో 1/2  టీ స్పూన్ మెంతులు, 1  టీస్పూన్ జీలకర్ర ,1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించండి. బాగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోండి.
  • తర్వాత పనులు 1 టీస్పూను ఆవాలు వేయించి పక్కకు తీసుకోండి.
  • ఒక 10 నుండి 15 ఎండు మిర్చి కూడా వేయించండి. కారం ఎక్కువగా కావాలనుకుంటే 20 నుండి 25 ఎండుమిర్చి తీసుకోండి.
  • తర్వాత 25 నుండి 30 కరివేపాకు ఆకులను తీసుకుని వేయించుకోండి. తడిలేకుండా డ్రై అయ్యేంత వరకూ వేయించుకోవాలి.
  • ఇప్పుడు ఇలా వేయించుకున్న ఇంగ్రీడెంట్స్ అన్నింటిని  పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో కి తీసుకోండి. ఇందులో ఒక పిడికెడు చింతపండును కలపండి. రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేయండి. వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేయండి. మీకు కారం తక్కువగా అనిపిస్తే కొంచెం కారం పొడి కూడా కలిపి గ్రైండ్ చేసుకొండి.
  • ఈ పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లోకి తీసుకుని భద్రపరుచుకోండి. ఈ పొడిని రెండు నుంచి మూడు నెలల వరకు వాడుకోవచ్చు.

ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ తో ఒక పది నిమిషాల్లో సాంబార్ రెడీ అయిపోతుంది. ఈ బిజీ లైఫ్ లో సాంబారు త్వరగా రెడీ  అవ్వాలంటే ఈ విధంగా సాంబార్ పొడిని చేసి పెట్టుకుంటే సరి. ఇలా తయారుచేసుకున్న పొడితో సాంబారు ఎలా తయారు చేసుకోవాలి పై వీడియో ద్వారా చూసి తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని ఉపయగాకరమైన వంటలు కొరకు మా పేజి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండం మర్చిపోకండి.

Leave a Comment

error: Content is protected !!