ముస్లిం స్టయిల్ లో కుష్క రైస్ చేసుకోండి

ప్రియమైన భోజన ప్రియు లారా.. ఈరోజు మనం కుష్క రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నాన్ వెజ్ కర్రీ ఈ రైస్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. పూర్తి రెసిపీ కొరకు ఈ వీడియో చూడండి ..

కావలసిన పదార్థాలు

  • చిన్న ఉల్లిపాయలు 6
  • పచ్చిమిరపకాయలు 2
  • కొత్తిమీర కొద్దిగా
  • పుదీనా కొద్దిగా
  • యాలకులు 2
  • అనాసపువ్వు ఒకటి
  • లవంగాలు 3
  • దాల్చిన చెక్క అరంగుళం
  • వెల్లుల్లి 7 8 రెబ్బలు
  • అల్లం అరంగుళం
  • టమోటో 1

కుష్క రైస్ తయారీ విధానం 

స్టవ్ మీద కడాయి పెట్టి అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేయండి. నూనె వేడెక్కిన తర్వాత మసాలా దినుసులన్నీ వేయండి. తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఫ్రై చేయండి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి కూడా వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత చిన్న సైజు టమోటా కట్ చేసి వేయండి. అర స్పూన్ ఉప్పు ని వేయండి. టమోటా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పుదీనా ఆకు కొత్తిమీరను వేసి కొద్దిగా వేయించండి. చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోండి.

ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైస్ ను కొద్దిగా నీరుపోసి అరగంట నానబెట్టండి. స్టవ్ ఆన్ చేసి దాని మీద కుక్కర్ పెట్టి కొద్దిగా వేగిన తర్వాత అందులో రెండు స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి  వేడెక్కాక అందులో రెండు బిర్యానీ ఆకులు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయండి. తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి వేయండి. ఉల్లిపాయ  కొద్దిగా వేగిన తర్వాత చిన్నసైజు టమోటా ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి వేయించండి. ఇప్పుడు ఇందులో ఒక టీస్పూన్ పసుపు వేసి బాగా కలపండి. తర్వాత ఇందులో ఒక స్పూన్ గరం మసాలా పొడి , అర్థ స్పూన్ కారంపొడి కలపండి.

కొద్దిగా వేగిన తర్వాత ఇంతకు ముందు తయారు చేసుకున్న మసాలా పేస్టు ఇందులో వేసి కొద్దిగా వేయించండి. ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల పెరుగు వేసి కలపండి. ఇప్పుడు  ఇందులో నీరు కలపాలి. ఒక గ్లాసు బాస్మతి రైస్ కి ఒకటిన్నర గ్లాసు నీటిని పోయాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఈ నీరు మరిగే వరకు ఉడికించండి. తర్వాత స్టవ్ మీద పెట్టి నానబెట్టిన బాస్మతి రైస్ ను కలపండి. కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ లో  ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ మీడియం ఫ్లేమ్  లో పెట్టి రెండు నిమిషాలు తర్వాత ఆఫ్ చేయండి. గ్యాస్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే వేడి వేడి కుష్క రెడీ.

Leave a Comment

error: Content is protected !!