how to prepare rayalaseema ragi sangati Ragi Mudda

అసలైన రాగి సంకటి ..ఇలాచేస్కోని వారానికి ఒకసారి తిన్నఎంతో బలం

ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రాగి సంగటిని మంచి కర్రీతో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో రాగి సంగటి రాగిముద్ద చేసుకోవడం చాలా తగ్గించారు. వారానికి ఒకటి రెండు సార్లయినా ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ తయారు చేసుకొని తినడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాగి లో క్యాల్షియం ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా ఒకవేళ రాగిసంగటి చేయడం రాకపోతే ఈ రెసిపీని చూసి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకొని ఒక సారి తయారు చేసుకుని తినండి.

రాగి సంగటి తయారీ విధానం

ముందుగా ఒక బౌల్ లోకి కప్పు బియ్యాన్ని తీసుకోండి. బియ్యాన్ని బాగా రెండు మూడు సార్లు కడగండి. తర్వాత ఇందులో ఒక కప్పు నీటిని పోసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఏ కప్పుతో రైస్ తీసుకున్నారు అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండిని తీసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో నాలుగు కప్పులు నీటిని తీసుకోండి. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి నీటిని బాగా వేడి చేయండి. తరువాత ఈ నీరు మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకొన్న బియ్యాన్ని వేయండి.

రైస్ మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దికొద్దిగా రాగి పిండి కలపండి. తర్వాత ఇందులో రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పును కలపండి. రాగి పిండి వేసిన తర్వాత కలపకుండా అలాగే మూత ఉంచి కొద్దిసేపు ఉడికించండి. ఒక ఐదారు నిమిషాల తర్వాత ఒక గరిటె తీసుకొని బాగా రెండు బాగా కలిసేటట్లు ఉండలు లేకుండా మిక్స్ చేయండి. తర్వాత లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. అంతే ఎంతో రుచికరమైన  రాగి సంగటి రెడీ అయిపోయింది. కొద్దిగా చల్లారిన తర్వాత నీటిని తీసుకొని ముద్దలుగా చేసుకోండి.(పూర్తి వివరాలకు వీడియో చూడండి)

రాగి సంగటిని నాన్ వెజ్ కర్రీ లతో లేదా పప్పు తో, సాంబార్ తో, చట్నీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి తప్పక నచ్చుతుంది. ఇలాంటి మరిన్నిhealthy రెసిపీల కోసం మా పేజి లైక్ చేయడం మర్చి పోకండి.

Leave a Comment

error: Content is protected !!