how to prevent virus mutation

వైరస్ ఎవరికి రాదు.తగ్గినవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

వైరస్ అనేది నోటి తుంపరల  ద్వారా ముక్కు నుండి ప్రవేశించి సమాజంలో అందరికీ వ్యాపిస్తుంది. వైరస్ సోకిన  తర్వాత కొంతమందిని ఇబ్బంది పెట్టచ్చు. కొంతమందిని  ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోవచ్చు. కాబట్టి వైరస్ ఇన్ఫెక్షన్ నాకు రాదు అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎప్పుడూ మందులు వాడని వారు ,సబ్బులు వాడని వ్యక్తులు కూడా ఇప్పుడు తప్పకవాడాల్సిన పరిస్థితి సంవత్సరన్నర నుండి ఏర్పడింది. బయటకు వెళ్ళినప్పుడు తప్పక మాస్క్ వాడాలి. శానిటైజర్ వాడాలి. సామాజిక దూరం తప్పక పాటించాలి. నాకు రాదు అనే నిర్లక్ష్యం వలన అనేక మంది ప్రాణాలకు ముప్పు తెచ్చిన వాళ్ళం అవుతాం. కొంతమందిలో లక్షణాలు ఉండవు. కానీ వైరస్ వ్యాపించి ఉంటుంది. వారు సరైన పద్థతులు పాటించకుండా అందరితో తిరిగితే వారికీ వ్యాధి వ్యాపిస్తుంది. 

వయసులో ఉన్నవారు నాకు సోకదు అనే నిర్లక్ష్యం కూడా తగదు. ఇంట్లో ఉండే చిన్న పిల్లలు, పెద్దవారికి ప్రమాదం తెచ్చినట్టే. నాకు వస్తే ఉపవాసం తో తగ్గించుకుంటా అనుకోవద్దు. వైరస్ సోకి తగ్గినవారు మంచి ఆహారం తీసుకోవాలి. శరీరం కోల్పోయిన శక్తిని ఆరోగ్య కరమైన ఆహారం ద్వారా అందించాలి. మాస్క్, శానిటైజర్ తప్పనిసరి. యాంటీబాడీస్ ఉన్నాయి కనుక తిరుగుతా అంటే మళ్ళీ కరోనా బారినపడే అవకాశం ఉంది. యాంటీబాడీస్ ఉన్నా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్పెక్షన్ గురైన ఊపిరితిత్తులు అనారోగ్యంతో ఉంటాయి కనుక మంచి బ్రీతింగ్ ఎక్సర్ సైజులు, ప్రాణాయామం చేస్తూ మంచి డైట్ ఫాలో అవ్వండి. 

విటమిన్ సి  పుష్కలంగా ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకుంటూ జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే చికెన్, పప్పు ఎక్కువగా తీసుకోండి. పచ్చని ఆకుకూరలు ఆహరంలో వారానికి రెండు సార్లయినా తీసుకోండి. వేడినీరు గోరువెచ్చగా తీసుకుంటూ ఉండండి. వీలైనంత బయట తిరగడం తగ్గించండి. కరోనా నిబంధనలు పాటిస్తూ మీరు మీ చుట్టుపక్కల వ్యక్తులు ఆరోగ్యంగా ఉండండి. తగ్గిపోయింది కదా అని నిర్లక్ష్యం చేయక ఏదైనా అనారోగ్యం అనిపిస్తే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Leave a Comment

error: Content is protected !!