How to Protect Babies and Toddlers

బడికి వెళ్లే పిల్లలకి వైరస్ రావొద్దు అంటే ఇది డైలీ ఇవ్వండి

పిల్లలు బడికి వెళ్తున్నారు. థర్డ్ వేవ్ వచ్చింది అక్టోబర్ నాటికి తీవ్రతరం అవుతుంది అని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. థర్డవేవ్ పిల్లలకి ప్రమాదం అని వింటున్నాం. కానీ పిల్లలని స్కూల్కి పంపకపోతే ఏ ఇబ్బంది వస్తుందో అనిభయపడుతూనే పంపిస్తున్నాం. పిల్లలకి ఎలాంటి వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పిల్లలకి పెట్టే మాస్క్ ముక్కు పై భాగం వరకు కవర్ అయ్యేలా ఉండాలి. మంచి క్వాలిటీ మాస్క్ కొనాలి. మాట్లాడేటప్పుడు జారకుండా ఉండేలా చూసుకోవాలి. పిల్లలు మాస్క్ తీయకుండా ఉండేలా మంచి మాటలు చెప్పాలి. రోగం వచ్చాక వేలకు వేలు ఖర్చుపెట్టడం కంటే ముందుగా జాగ్రత్త పడటం మంచిది కదా. భోజనం చేసేటప్పుడు కూడా మాస్క్ తీసి అందరికి కొంచెం దూరంగా కూర్చుని తినమని చెప్పాలి.

మేమందరం ఇంట్లో ఉంటున్నాం నువ్వు ఒక్కడివే బయటకి వెళ్లాల్సివస్తుంది కాబట్టి వేరే వాళ్ళకి వైరస్ ఉంటే నీకు అంటుకుంటే ఇంట్లో అందరికి వస్తుంది. నీకు రోగ నిరోధక శక్తి  ఎక్కువ నీకు ఏమి కాదు మాకు రోగ నిరోధక శక్తి తక్కువ  అని నచ్చచెప్పి మాస్క్ తీయొద్దని చెప్పాలి. పిల్లలకి లేత చర్మం కాబట్టి శానిటైజర్కి బదులు టీ ట్రీ ఆయిల్  లేదా యూకలిఫ్టస్ ఆయిల్ చిన్న డబ్బాలో వేసి ఇచ్చి రెండు డ్రాప్స్ వేసుకుని రఫ్ చేసుకోమని చెప్పండి. ఇది శానిటైజర్ కంటే పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇవి నాచురల్ ఆయిల్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లలు దేనినైనా తాకినప్పుడు చేతులకి రాసుకోమని చెప్పండి సరిపోతుంది. స్కూల్ నుండి రాగానే వేడినీళ్ళతో స్నానం చేయించి విప్పిన బట్టలు తడిపించి ఉతికిన బట్టలు తొడగాలి. ఆ తర్వాత పిల్లలకి ఆవిరి పట్టించాలి. వేడినీటిలో పెప్పర్మెంట్ ఆయిల్ లేదా కర్పూరం,పసుపు వేసి ఆవిరి పట్టించాలి. పిల్లలు పీల్చినా గాలి ద్వారా వైరస్ ఏమైనా వెళ్ళినట్లయితే ఆవిరి పీల్చడం వలన వైరస్ చచ్చిపోతుంది. పెద్దవాళ్ళు బయటకి వెళ్లి వచ్చిన వైరస్ ఇంట్లోకి ప్రవేశించలేదు ఎందుకంటే పెద్దవాళ్ళు జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తారు. పిల్లలు బయటకి వెళ్లి వస్తే వాళ్ళతో పాటు వైరస్ ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పిల్లల్ని ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకునేలా చూసుకోవాలి. ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు మాస్క్ పెట్టుకోకపోయిన పర్వాలేదు. పెద్దవాళ్లతో కలిసి ఉన్నపుడు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకునేలా చూసుకోవాలి. భోజనాలు చేసేటపుడు దూరంంగా కూర్చోపెట్టాలి. స్కూల్లో, బస్లో వెళ్లేటపుడు, జనంలోకి వెళ్లినపుడు సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పాలి. ఈ విధంగా జాగ్రత్తలు పాటించినట్లయితే పిల్లలను ఇన్ఫెక్షన్ నుండి కాపాడుకోవచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనిపిస్తే వెంటనే తేనె కలిపిన నీళ్లు,గోరువెచ్చని నీళ్లు,కొబ్బరి నీళ్లు తాగి ఇంటర్మిట్టెన్ ఫాస్టింగ్ చేయడం వలన వైరస్ చచ్చిపోతుంది. ఇంక మందులు, హాస్పటల్స్ అవసరం కూడా ఉండదు. ఈ జాగ్రత్తలు పాటించి పిల్లలను థర్డ్ వేవ్ నుండి కాపాడుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!