How to Protect Eyes Tips to Keep Eyes Healthily

మీరు ఇలా చెయ్యండి కళ్ళు క్లీన్ అవుతాయి…

సాధారణంగా కార్పెంటర్లు పనిచేసేటప్పుడు ఎక్కువగా దుమ్ము అనేది వాళ్ళ కళ్ళల్లోకి చేరుతూ ఉంటుంది. ఈ కార్పెంటర్లకి చెక్కలకు చిత్రీ పెట్టేటప్పుడు రంపపు మిషన్ తో తిప్పినప్పుడు గాని డస్ట్ ఎక్కువ కళ్ళల్లోకి చేరుతుంది. దీనివల్ల కళ్ళు ఎక్కువగా పాడైపోయే  అవకాశం ఉంటుంది. కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళకి సాధారణంగా కంటి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి. దీనికి కారణం కంట్లోకి ఈ రంపపు పొట్టు అనేది చాలా ఎక్కువగా చేరడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ చిన్న రంపపు పొట్టు కళ్ళలోకి చేరడం వల్ల కళ్ళు ఎరుపుగా మారి మంటగా ఉంటాయి. సాధారణంగా వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ చెక్కల పని చేస్తూనే ఉంటారు. 

                    దీనివల్ల కళ్ళల్లో దుమ్ము ఎక్కువగా చేరి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళకి కంట్లో నుండి నీళ్లు కారడం ఎక్కువగా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు సరిగా పనిచేయడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా కంట్లోకి డస్ట్ చేరకుండా ఉండాలి. దీనికి పరిష్కారం ఏమిటి అంటే మరీ కంటిని క్లీన్ చేసుకోవడానికి ఒక చక్కటి చిట్కా ఉంది. అది ఏమిటి అంటే ఐ కప్స్ అని సర్జికల్ షాప్స్ లో అమ్ముతారు. వాటిని తీసుకుని కనుక నీళ్లు పోసి కంటి మీద పెట్టుకుంటే కళ్ళు బాగా క్లీన్ అవుతాయి. ఇలా చేస్తే కంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇలా చేయడం కుదరదు అనుకుంటే సాయంత్రం డ్యూటీ నుంచి రాగానే మంచి స్వచ్ఛమైన నీళ్లను తీసుకోవాలి.

                    కంటి రెండు రెప్పలను చేతితో పట్టుకొని ఈ నీళ్లతో కళ్లలో గట్టిగా కొట్టాలి. ఇలా చేస్తే కళ్ళలో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా నీళ్లు  ఉపయోగించి ఈ ప్రక్రియ చేస్తే కంటి మూలల్లో ఉన్న మనకు తెలియని డస్ట్ కూడా బయటకు వచ్చేస్తోంది. కార్పెంటర్ వర్క్ చేసేటప్పుడు కంటికి కళ్లద్దాలు కంపల్సరిగా పెట్టుకోవాలి. అలాగే మాస్క్ కూడా తప్పని సరిగా పెట్టుకోవాలి. ఇటు కళ్ళు అటు లంగ్స్ రెండు డామేజ్ అవ్వకుండా ఉంటాయి. లేదు అనుకుంటే నయనం  ప్రధానం అంటారు అది పోతుంది. మరి ప్రాణానికి ఆధారం ప్రాణవాయువు తీసుకుని ఊపిరితిత్తులు కూడా పాడైపోతాయి.

                     కాబట్టి ఈ రెండిటి రక్షణ కోసం ఈ చిట్కాలను పాటిస్తే అటు కళ్ళు మరియు లంగ్స్ కూడా  హెల్దీ గా ఉంటాయి.

Leave a Comment

error: Content is protected !!