how to protect yourself from coronavirus at home

కరోనాకు మందుంది ఎవరికి తెలియడం లేదంతే…!

ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద భయం కరోనా…… నిజానికి ఇప్పటిదాకా మన ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎన్నో జబ్బులు వచ్చాయి, వాటిని  భరించి గట్టిగా నిలబడ్డది ఈ ప్రపంచం. ప్రపంచం గూర్చి కాకపోయినా మనదేశం కూడా ఎన్నో విపత్తులను తట్టుకొని నిలబడ్డ దేశం. కానీ కరోనా విషయం లో పాలకుల నుండి సాటి  పౌరుడు కూడా చేతులెత్తేశారు. ఎక్కడి నుండి వస్తుందో కనిపించని శత్రువు అంటూ భయంతోనే సగం ప్రాణాలు నీరు కార్చుకున్నారు. ఇప్పటికే ఎంతోమంది కరోనా విషయంలో  మన ఆత్మస్థైర్యమే మనకు గొప్ప మెడిసిన్ అని చెప్పినా ఎవరూ బుర్రకు ఎక్కించుకోవట్లేదు. దైర్యాన్ని మించిన మెడిసిన్ ఎక్కడుంది?? కింద పద్ధతుల ద్వారా కరోనాకు దూరంగా ఉంటూ, ధైర్యం గా ఉంటే జీవితం ఆనందమయం అని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూడండి ఒకసారి

ఆహారం 

మనం తీసుకునే ఆహారం తాజాగా వేడిగా ఉండాలని నిపుణుల సూచన, అలాగే వండే ముందు కూరగాయలను ఉప్పు నీళ్లలో కడిగి వండుకోవడం చాలా మంచిది. ఫ్రిజ్ లో నిల్వ చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి, ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు వంటివి తీసుకోకపోవడం ఉత్తమం. ఎందుకంటే వైరస్, బాక్ట్రిరియా వృద్ధి కావడానికి తోడ్పడే చల్లని పదార్థాలు కానీ వాతావరణం జోలికి కానీ వెల్లకపోవడం మంచిది.  వీలైనంతవరకు ఇంట్లో వండిన ఆహారం తీసుకోవడం ఉత్తమం.

బయటకు వెళ్ళినపుడు జాగ్రత్తలు

బయటకు వెళ్ళినపుడు  మాస్క్ తప్పనిసరి. అలాగే శానిటైజర్ కూడా తప్పకుండా వెంట ఉంచుకోవాలి. వీలైనంత వరకు ఫుల్ హాండ్స్ ఉన్న దుస్తులు ధరించడం ఉత్తమం. రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెల్లకపోవడం, మెహమాటం తో బయటి ఫుడ్ తినడం లాంటివి మానుకోవాలి. బయటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు సామాజిక దూరం పాటించడం. షేక్ హాండ్ ఇవ్వకుండా దూరంగా వుండే పలకరించడం వల్ల మీకు ఎదుటి వ్యక్తికి కూడా మంచిది.

బయట నుండి ఇంటికి వచ్చాక

బయట నుండి ఇంటికి వచ్చాక నేరుగా బాత్రూమ్ లోకి వెళ్లి ఆ దుస్తులను తొలగించి కుదిరితే స్నానం చేసి పొడి దుస్తులు ధరించడం ఉత్తమం. బయటకు వెళ్లి  వచ్చేవారు  ప్రతిరోజు వాటిని ఉతికి వాడుకోవాలి. ఇక ఇంట్లో వేడి నీళ్లు తాగటం, శుభ్రత, ఫ్రెష్ గా వండుకున్న ఆహారాన్ని తీసుకోవడం, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినటం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లు. వ్యాయామం, ముఖ్యంగా రోజులో కనీసం అరగంట సేపు అయినా సూర్యరశ్మి నేరుగా ఒంటిమీద పడేలా జాగ్రత్త తీసుకోవడం. కనీసం రెండు లేక మూడు రోజులు ఒకసారి నీటి ఆవిరి పట్టుకోవడం. పసుపు కలిపిన పాలు. అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క వేసి చేసిన టీ, లేక పాలు. 

ఇంకా ఇంట్లో కుళ్లిపోయే స్వభావం ఉన్న ఏ పదార్థాలను నిల్వ ఉంచకపోవడం. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం. ప్రతిరోజు వీలు కాకపోతే రెండు రోజులకు ఒకసారి అయినా ఇంటిని తుడుచుకోవడము.  

చివరగా…….

కరోనా కేవలం మాటల ద్వారా పుట్టించిన భయమే ఎక్కువ. కరోనా వల్ల ఇప్పటి వరకు చనిపోయిన వారిలో వారికి అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల ప్రభావం కూడా ప్రతికూలంగా మారి వైరస్ బారి నుండి కొలుకోలేక పోయారు. ఇరుగు పొరుగు బయటి వ్యక్తుల మాటలను సీరియస్ గా తీసుకోకండి. దానివల్ల రక్తపోటు పెరిగి కరోనా సమస్య లేకున్నా ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. మన దేశంలో ఎంతమందికి కరోనా తెలియకుండానే వచ్చి పోయి ఉంటుంది కూడా. నిజం కాదంటారా??? 

కరోనాను జయించే గొప్ప మందు కేవలం ఆత్మవిశ్వాసం, ధైర్యం అంతే.

Leave a Comment

error: Content is protected !!