How to Reduce 4th Wave Virus Naturally

కోవిడ్ బూస్టర్ డోస్ యొక్క ఉపయోగాలు…… నాచురల్ గా 4th వేవ్ వైరస్ నుంచి ఎలా తప్పించుకోవచ్చు………

కోవిడ్ వైరస్ నుంచి తప్పించుకోవడానికి అందరూ రెండు వ్యాక్సిన్లు వేయించుకున్నారు. మన గవర్నమెంట్ వారు వీటిని ఉచితంగా ఇచ్చారు. కొంతమంది డబ్బులు ఉన్నవారు మాత్రం బూస్టర్ డోస్ కూడా వేసుకున్నారు. ఈ మధ్యకాలంలో బూస్టర్ డోస్ కూడా అందరికీ ఉచితంగా వేయాలి అని గవర్నమెంట్ వారు ప్రతిపాదించారు. ఈ బూస్టర్ డోస్ వేసుకోవడం వలన మన శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యి 4th వేవ్ నుంచి మనల్ని రక్షిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు తీసుకోవడం మంచిది.

చాలామంది పూర్వం మాదిరి ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చిన అంత ప్రమాదం జరగటం లేదు కదా అని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ బూస్టర్ డోస్ తీసుకోవడం వల్ల 4th వేవ్ యొక్క ప్రమాదం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదం నుంచి మనం బయటపడడానికి బూస్టర్ డోస్ అందరూ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది తీసుకుంటే ఏదో అవుతుంది అని నెగటివ్ ఆలోచన పక్కన పెట్టి ప్రతి ఒక్కరు తీసుకోవాలి. బూస్టర్ డోస్ తీసుకున్నప్పటికీ కొంతమందికి అప్డేట్ అయినా కరోనా సోకుతుంది.

దాని లక్షణాలు చాలా తక్కువగా ఉండడం వలన అంటే లైట్ గా ఫీవర్, జలుబు, దగ్గు వంటి లక్షణాలు  కనిపిస్తాయి. వాటిని ఈ వర్షాకాలంలో వచ్చే లక్షణాలు అనుకోకుండా వెంటనే మందుల జోలికి మరియు ఫుడ్ జోలికి వెళ్లకుండా ఒక రెండు మూడు రోజులు మీ శరీరం కోరుకునే విధంగా సహకరించండి. అవసరం అనుకుంటే తర్వాత వెళ్ళండి. ఇలా దగ్గు జలుబు జ్వరం వచ్చినప్పుడు మన శరీరం రెస్ట్ ను కోరుకుంటుంది. కనుక శరీరం కోరుకున్నట్టు జీర్ణకోసానికి రెస్ట్ ఇవ్వడం అవసరం. మీరు శరీరాన్ని సహకరిస్తే వ్యాక్సిన్ ఇచ్చిన దానికంటే శరీరం ఇంకా మెరుగైన ఆంటీ బాడీస్ ను నాచురల్ గా తయారు చేస్తుంది. 

నాచురల్ వ్యాక్సినేషన్ సహజంగానే మన శరీరంలో ఉంది. కనక ఉపవాసం చేస్తే నాచురల్ వాక్సినేషన్ శరీరం రెడీ అవుతుంది. దీనికి కాచి చల్లార్చిన నీరు రోజు తాగుతూ ఉండాలి. నీరసం రాకుండా, కళ్ళు తిరగకుండా, ఆకలి వేయకుండా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నాలుగు స్పూన్ల తేనె ఒక నిమ్మకాయ రసం కలుపుకొని తాగండి. ఇంకా రుచిగా ఉండాలి అంటే కొంచెం మిరియాల పొడి కూడా కలుపుకోవచ్చు. దీనితో పాటు ఒక కొబ్బరిబండం తీసుకుంటే ఇలా మన జ్వరం తగ్గే వరకు చేస్తే తగిన యాంటీ బాడీస్ శరీరంలో తయారవుతాయి. వెంటనే మనకి నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది.

Leave a Comment

error: Content is protected !!