how to reduce 5 kg in 15 days at home

ఎంత లావుగా ఉన్నా సరే నెలకి ఐదు కిలోల బరువు తగ్గుతారు

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఫాస్ట్ఫుడ్స్, జంక్ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. బయట ఆహారాలు ఎక్కువగా తీసుకుని  అధిక బరువు సమస్యను తెచ్చుకున్న తర్వాత మళ్ళీ తగ్గడం కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. అయినా ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు. చాలా ఆహారనియమాలు, డైట్, వ్యాయామాలు వంటివి చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించట్లేదు. టీనేజ్ వయసు నుండి ముసలివాళ్ళు వరకు ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

         ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అధిక బరువు సమస్య కలిగి ఉండటం వల్ల నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ డ్రింక్  తయారుచేసుకొని ప్రతిరోజు తాగినట్లయితే నెలలో ఐదు కిలోల బరువు తగ్గుతారు.  ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి కావలసినవి   జీలకర్ర, సొంటి, నిమ్మకాయ. ఒక గ్లాసు వేడి నీళ్లు తీసుకోవాలి. తర్వాత దీనిలో అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. 

        నిమ్మరసం  వేడినీటిలో పిండడం వలన శరీరంలో అధిక కొవ్వు కరుగుతుంది. తర్వాత మిక్సీ జార్ లో జీలకర్ర వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న నీటిలో ఒక చెంచా జీలకర్ర పొడి వేసుకోవాలి. సొంటి కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. సొంటి అంటే  ఎండబెట్టిన అల్లం. దీనిని కూడా ముందుగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం, జీలకర్ర పొడి కలుపుకున్న నీటిలో ఒక చెంచా సొంటి పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి.  బాగా కలిపిన తర్వాత ఈ నీటిని ఒకసారి వడగట్టుకుని గ్లాస్ లో వేసుకోవాలి.

       ఈ నీటిని ప్రతి రోజు ఉదయాన్నే టిఫిన్ చేయడానికి ఒక అర గంట ముందు తాగినట్లయితే శరీరంలో అధిక కొవ్వు కరుగుతుంది.  ఈ డ్రింక్ వేడి వేడిగా తాగితేనే  ఫలితం ఉంటుంది.  ఈ డ్రింక్ ప్రతి రోజు క్రమం తప్పకుండా తాగినట్లయితే ఎంత వేళ్ళాడే పొట్ట అయినా సరే ఐస్ లా కరిగి పోతుంది. ఇది తాగి వ్యాయామాలు చేస్తూ ఆహార నియమాలు పాటించి నట్లయితే  ఒక నెలలో ఐదు కిలోల వరకు బరువు తగ్గించుకోవచ్చు. ఈ డ్రింక్ తాగడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదు అనుకునే వారు ఒక్కసారి  ఈ డ్రింక్ తాగి చూడండి. మంచి ఫలితం ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!