how to reduce body heat with ayurvedic method

5 Zabardast పద్ధతులతో Bodyలో వేడిని తగ్గించుకోండి (Pitta Dosha 🔥)

జుట్టు తెల్లబడుతుందా లేదుగా ప్రాబ్లం ఉంటుందా ఒకవేళ అవును అంటే మీరు తెలుసుకోవాలి ఈ ప్రాబ్లంకి కారణం బాడీలో వేడి పెరిగిపోవడం. నోటితడి ఆరిపోవడం, ఎక్కువగా చెమట పట్టడం, నోటి పూత , బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం ఇలాంటివన్నీ మీకు శరీరంలో వేడిచేసిందనేందుకు లక్షణాలు. ఎలాంటి మందులు వాడినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. వేసవి తగ్గినా అలాంటప్పుడు కూడా శరీరంలో వేడి అవుతుంది నా ఉద్దేశ్యం ప్రకారం శరీరంలో వేడి పెరిగిపోవడం వల్ల ఈ ప్రాబ్లం రావడం మొదలవుతుంది.అంతే కాకుండా ఆల్కహాల్, ఆహార పదార్థాల వల్ల కూడా మన బాడీలో వేడి పెరుగుతుంది. కానీ టెన్షన్ పడకండి

 ఒక చిన్న బకెట్ తీసుకుని దాంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్, కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాటర్ లో మీ కాళ్ళను పది, పదిహేను నిమిషాల వరకు పూర్తిగా మునిగేలా ఉంచండి. మధ్యలో ఒకటి, రెండుసార్లు కాళ్ళను బయటకు తీసి మసాజ్ చేయండి. బాడీలో వేడి త్వరగా తగ్గిపోతుంది. అందుకే  మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇలా చేస్తూ ఏదైనా బుక్ కూడా చదువుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ రాత్రి పడుకునే ముందు చేస్తే జబర్దస్త్ గా నిద్ర పడుతుంది ట్రై చేయండి. 

అలాగే ఇంకొకటి బియ్యం నీరు. శరీరం మరియు కడుపులోని వేడిని తొలగించడానికి విరివిగా ఉపయోగిస్తారు. మీరు పది గ్రాముల బియ్యం తీసుకోండి భోజనం చేయడానికి ఒక అరగంట ముందు తాగడం. ఒక రోజులో రెండుసార్లు తాగితే చాలు. వేడి అధికంగా ఉంటే దాని వల్ల నోటి పూత వస్తుంది. అందువల్ల ఈ నీళ్ళు నోటిపూతకు కూడా బాగానే పనిచేస్తుంది. ఇది ఇన్ట్సెంట్ పుల్లర్. ఇది స్ట్రెస్, హెయిర్ ఫాల్, గ్రే హెయిర్, అసిడిటీని కంట్రోల్ చేస్తుంది. మంచి ఫలితాలు కోసం సెమీపాలిష్డ్ రైస్ తీసుకోవాలి. 

తర్వాతది గంధం. గంధం కూలింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉండడం వలన పూర్వకాలం నుండి దీన్ని శరీరంలోని వేడిని తొలగించడానికి వాడుతున్నారు. దీనికోసం రెండు పదార్థాలు కావాలి. ఒకటి గంధం పొడి, రెండు రోజు వాటర్ ఈ రెండూ కలిపి మిశ్రమంగా చేసి మీ నుదుటిపై అప్లై చేసుకోండి. స్వచ్ఛమైన గంధం మెదడు, శరీరాన్ని వెంటనే చల్లబరచి శరీర వ్యవస్థను కూడా చల్లబరుస్తుంది. ఏకాగ్రతను పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. పరీక్షల సమయంలో ఒక సారి ప్రయత్నించి చూడండి. మీకు ఎక్కడైనా దురదలు, దద్దుర్లు ఉంటే అక్కడ కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. వెంటనే మంచి ఫలితం చూపిస్తుంది. ఈ మిశ్రమం శరీరమంతా పూసుకోవచ్చు. గంధం అన్ని సూపర్ మార్కెట్లో, పచారీ షాపుల్లో దొరుకుతుంది. 

తర్వాతది శీతలీ బ్రీత్ లేదా కూలింగ్ బ్రీత్. ఇది ఒక యోగా టెక్నిక్. మీ బాడీని వెంటనే చల్లబరుస్తుంది. బయట కూర్చుని పద్మాసనంలో ఉండి మీ నాలుకను బయటకు తీసి క్యూబ్ లాగా మార్చండి నోటి నుండి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. తర్వాత గాలిని ముక్కుద్వారా బయటకు రండి. ఇది ఒక 8 నుండి 10 సార్లు చేయండి. మీరు దీనిని కుర్చీపై కూర్చుని కూడా చేయవచ్చు. ఇది చేస్తున్నప్పుడు మీరు శరీరం చల్లబడటం అనుభూతి చెందుతారు. తరువాతది ముఖ్యమైనది ఆహారమే ఔషధం. మీరు తినే ఆహార పదార్థాలు శరీరంలో వేడిని పెంచుతాయి. కొన్ని మాత్రం శరీరానికి చలవ చేస్తాయి. ఉప్పు, పులుపు, కారం,  నిమ్మకాయ, ఉసిరికాయ వదిలేసి మిగతా పుల్లగా ఉండే పండ్లన్నీ శరీరంలో వేడిని పెంచుతాయి.

 మీ శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే మసాలాలు, కారాలు తగ్గించండి. ప్యాకేజ్డ్ ఫుడ్ తగ్గించండి. చేదుగా, తీయగా  ఉండే పదార్థాలు శరీరానికి చలువ చేస్తాయి. సో మీరు అలాంటి ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. కానీ వాటిని చేస్తున్నప్పుడు షుగర్ కు బదులు బెల్లం దారం కలిగిన పటిక వాడండి. నీళ్లు ఎక్కువగా తాగండి. కానీ కూలింగ్ వాటర్ కాదు దాంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి కుండలను ఉపయోగించండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినండి. సహజంగా నీటి శాతం కలిగిన పండ్లు తినండి. ఖర్బూజా, దోసకాయ, పుచ్చకాయ, గుమ్మడికాయ, వంటివి ఎక్కువగా తీసుకోండి. రిఫైన్డ్ నూనెలు తగ్గించి ఆవునెయ్యి ఎక్కువగా తీసుకోండి. ఇలాంటి ఆహారంతో శరీరంలో వేడి తగ్గించుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!