గొంతులో కఫం, నొప్పి, దగ్గు వస్తుంటే చాలా ఇబ్బంది గా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు కఫం, దగ్గు అయినా సరే క*రోనా అని భయపడే పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంట్లోనే ఎలా చికిత్స చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే అల్లం, లవంగం వీటిని చాలా త్వరగా తగ్గిస్తుందంటే మీరు నమ్ముతారా. వీటితో గొంతు సమస్యలకు చిట్కా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
ఒక గిన్నెలో ఒక గ్లాసు పాలు వేసుకోవాలి. అందులో ఒక ఇంచు ముక్క అల్లం మరియు నాలుగు లవంగాలు పువ్వు ఉన్నవి తీసుకోవాలి. ఈ రెండు దంచి మరుగుతున్న ఈ పాలలో వేసుకోండి. ఐదునిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి గ్లాసులోకి వడకట్టుకోవాలి. ఇందులో తేనె వేసి తాగవచ్చు. ఒకవేళ డయాబెటిస్ పేషెంట్ అయితే తేనె లేకుండా తీసుకోవడం మంచిది. ప్రతిరోజూ రాత్రి ఇలా వేడివేడిగా తీసుకోవడం వలన గొంతు నొప్పి, కఫం కరిగిపోతుంది. ఇది మంచి రుచితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
అల్లం తీసుకోవడం వలన గొంతు నొప్పి, గొంతులో మంట నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అల్లం యొక్క శోథ నిరోధక ప్రభావాలు మంట నుండి ఉపశమనం పొందడం ద్వారా గొంతు నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. శరీరంలోని ప్రో-ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్లను తగ్గించడం ద్వారా అల్లం కఫం, గొంతు నొప్పులను తగ్గించవచ్చు అని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ ప్రోటీన్లు తాపజనక నొప్పి మరియు దురద తగ్గడానికి కారణమవుతాయి. దీనిలో చిటికెడు పసుపు కూడా వేయండి. పసుపు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలను కలిగిఉంటుంది. పసుపు కలిపిన వేడినీళ్ళు తాగడం లేదా గొంతును పుక్కిలించడం వలన కూడా గొంతునొప్పి కి ఉపశమనం లభిస్తుంది.
లవంగాలు: లవంగాలు శోథ నిరోధక సమ్మేళనాల నిధి, ఇది గొంతు, దగ్గు, జలుబు మరియు సైనసిటిస్ సమయాల్లో ఉపయోగపడుతుంది. మీరు కొన్ని లవంగాలను పచ్చిగా నమలవచ్చు, లేదా వేడి నీటితో కలపి తాగవచ్చు మరియు ఉదయాన్నే త్రాగవచ్చు మరియు మీ కప్పు చాయ్లో కూడా కలపవచ్చు.