How to Reduce Cholesterol From Body

రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది

ఇప్పుడు అధికంగా వస్తున్న జబ్బులు గుండెపోటు  ఒకటి.  ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి గుండె జబ్బులు వస్తున్నాయి. గుండె జబ్బులు రాకుండా ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి  ఆహారం తీసుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. సడెన్ కార్డియాక్ అరెస్ట్ హార్ట్ ఎటాక్ 2 వేరు ఒకటి కాదు. రావడానికి మనకు మనంగా కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడం కారణం.

మరి మనం అలా పాటించని విషయాలు ఏంటి అంటే ఎలాంటి పరిస్థితులు గుండెజబ్బులకు దారితీస్తాయి.  టెన్షన్ ఎక్కువగా ఉండే లైఫ్ స్టైల్ ప్రధాన కారణంగా చెబుతున్నారు.  అలాగే ధూమపానం మరియు పొగాకు ఉత్పత్తులతో గుండెపోటు వస్తుందట. ధూమపానం మరియు పొగాకు వినియోగం  వలన గుండెపోటు ప్రమాదం మరింతగా పెరుగుతోంది. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండాలి. పొగాకు ఉత్పత్తులు తినొద్దని డాక్టర్లు చెబుతున్నారు. 

డయాబెటిస్, హై బీపీ కూడా గుండెజబ్బులకు దారితీస్తాయి. అధిక బరువు ఉండకూడదు. మానసిక ఒత్తిడి తగ్గడానికి యోగ లేదా వ్యాయామం చేయాలి.  సడెన్ కార్డియాక్ అరెస్ట్ ఇది వ్యాయామం అతిగా చేయడం వలన వస్తుంది. మనిషికి 30-40 నిముషాల వ్యాయామం సరిపోతుంది. అంతకు మించి చేయడం వలన ప్రాణాలకే ముప్పు అని డాక్టర్లు సూచిస్తున్నారు.  సడెన్ కార్డియాక్ అరెస్ట్ రాకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.

రోజుకు పది నిమిషాలు నడవాలి. ఇంట్లో బరువున్న వస్తువులను   హార్డ్ గా ఉండే బుక్   కవర్ను ఎత్తడం వంటివి చేయాలి. రోజుకు ఒక పండు ఒక వెజిటేబుల్ తినాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒక పండు ధాన్యాలు ఉండేలాగా చూసుకోండి. షుగర్ ఫ్రీ పానీయాలు తాగాలి . క్యాలరీలు ఎక్కువగా ఉన్న నట్స్  రోజుకో రకం తినాలి. డ్డ్రై ఫ్రూట్స్, సీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అది గుండె ఆరోగ్యానికి మంచిది. రోజుకు ఒకసారైనా గాఢంగా ఊపిరి తీసుకోవడం వంటి వ్యాయామం చేయాలి. ఈ చిట్కాను ట్రై చేసినట్లయితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 

20 గ్రాముల ధనియాలు,  10 గ్రాముల  సోంపు, 10 గ్రాముల తెల్ల ఆవాలు, రెండు చెంచాల పసుపు, రెండు అంగుళాల దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. గ్లాస్ నీళ్ళు వేసుకొని దానిలో ఒక చెంచా పొడిని కలిపి అయిదు నిమిషాల పాటు మరిగించాలి. నీటిని వడకట్టుకొని  గోరువెచ్చగా ఉన్నప్పుడు టిఫిన్ చేసిన తర్వాత లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత కానీ రోజు తాగాలి. ఇలా తాగడం వల్ల గుండె జబ్బులు దూరంగా ఉంటాయి. 

నైట్రిక్ ఆక్సైడ్, కో Q10  యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు దరిచేరవు. యాంటీఆక్సిడెంట్స్ దానిమ్మకాయ, బీట్రూట్, పుచ్చకాయ, పుల్లగా ఉండే కాయలలో ఉంటాయి. ఒక కప్పు కొత్తిమీర, ఒక బీట్రూట్, ఒక పెద్ద కప్పు పాలకూర వాటర్ వేసి జ్యూస్  లాగా చేసుకోవాలి. కొంచెం నిమ్మరసం, ఒక స్పూన్ ఆవ నూనె వేసి బాగా కలుపుకుని రోజు టిఫిన్ తో పాటు తీసుకున్నట్లయితే హార్ట్ ఎటాక్ వంటి జబ్బులు రాకుండా ఉంటాయి.

Leave a Comment

error: Content is protected !!