How to Reduce Cholesterol From Body

కొలెస్ట్రాల్ తగ్గించుకోండి హార్ట్ ఎటాక్ నుండి బయటపడండి | How to Reduce Cholesterol From Body

కొలెస్ట్రాల్ మన జీవనశైలి, ఆహారపుటలవాట్లవలన శరీరంలో పేరుకుపోయి అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. అసలు కొలెస్ట్రాల్ వలన శరీరానికి జరిగే నష్టాలేంటి అనేది తెలుసు. పెరిగిపోయిన కొలెస్ట్రాల్ ని కొన్ని సులభతరమైన చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం. 

ఈ చిట్కాలలో వాడే పదార్థాలు మందులకంటే ప్రభావవంతంగా శరీరంపై పనిచేస్తాయి. మరియు గుండె సమస్యలు తగ్గించడానికి సహజమైన పదార్థాలు చాలా చక్కగా పనిచేస్తాయి. శరీరంలో తయారయ్యే కొలెస్ట్రాల్ పద్దెనిమిది సంవత్సరాలు లోపు శరీర పెరుగుదలకు సహాయపడుతుంది. పద్దెనిమిది నుండి ఇరవై రెండు సంవత్సరాలు తర్వాత ఎత్తుపెరగడం ఆగిపోతుంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తినడం, మద్యం తాగడం, రోజూ వ్యాయామం లేకుండా ఉండడం వలన శారీరక శ్రమ లేకపోవడం వలన  40సంవత్సరాలు తర్వాత శరీరంలో పెరిగిపోయిన కొలెస్ట్రాల్ లక్షణాలు వలన చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సరైన శ్రద్ధ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగడం లేదా తగ్గడం మన చేతుల్లోనే ఉంటుంది.

 మామూలుగా జనంలో 5%మందికి మాత్రమే గుండెల్లో లోపాలు ఉండడం వలన గుండెవ్యాధులు వస్తాయి. మిగతా 95%మంది జనం మాత్రం పేరుకుపోయిన కొవ్వు వలన రక్తనాళాల్లో రక్తప్రసరణ ఆగిపోయి గుండెపోటు వస్తుంది. 

జీవనశైలి మార్పులతో ఇంటి చిట్కాలతో కొవ్వును తగ్గించుకోవచ్చు. రక్తనాళాల్లో రక్తప్రసరణ ఆగిపోవడానికి కొవ్వు మాత్రమే కారణంకాదు. కొంతమందికి కొలెస్ట్రాల్ లేకపోయినా గుండెపోటు వస్తుంది. దానికి కారణం రక్తనాళాల లోపల ఉండే చర్మ ద్వారం. 

ఎప్పుడైతే శరీరంలో విషపదార్థాలు పెరిగిపోతాయో వాటిలో ఉండే బాక్టీరియా చర్మద్వారంపై దాడిచేస్తాయి. దీనివలన చర్మంపై పుండుపడుతుంది. నష్టాన్ని తగ్గించడానికి అక్కడ కొవ్వు ఎక్కువ పేరుకుంటుంది. అక్కడ పుండు తగ్గిపోతే అక్కడ వాపు, కొవ్వు కూడా తగ్గిపోతుంది. లేకపోతే వాపువలన కొవ్వు పేరుకుని రక్తప్రసరణ ఆగిపోతుంది. 

దానివలన గుండెపోటు వస్తుంది. అందుకే రక్తనాళాలను ధృడంగా చేసే పదార్థాలు తీసుకోవాలి. ముందుగా జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. చెడుకొలెస్ర్టాల్ తగ్గించుకోవాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్లు‌, సాట్యురేటెడ్ ఫాట్స్, బాడ్ కొలెస్ట్రాల్, ఉండేవి మానేయాలి.

అవి ఎందులో ఎక్కువగా ఉంటాయంటే మాంసం, గుడ్లు, ఫ్రై చేసిన పదార్థాలు, డాల్డా, బటర్, మైదాతో తయారుచేసిన పదార్థాలు, పంచదార తో చేసిన స్వీట్స్ సిగరెట్, ఆల్కహాల్, ప్యాకేజీ స్నాక్స్ లో అధికంగా ఉంటాయి. వీటిని కొన్నాళ్ళు మానేయడం లేకపోతే పూర్తిగా మానేయడంవలన తగ్గిపోతుంది. 

ఫైబర్ ఉండే పదార్థాలు తినాలి. మల్టీగ్రెయిన్ రోటీ, దలియా ఉప్మా, ఓట్స్, సత్తుపిండి, బ్రౌన్ రైస్, జొన్నరొట్టెలు, సజ్జలు వంటి పదార్థాలు తినాలి. పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సీజనల్గా వచ్చేవి ఎక్కువగా తీసుకోవాలి. ఉదయం తీసుకునే అల్పాహారం గా సలాడ్, జ్యూస్, మొలకలు, సూప్స్, పండ్లు తీసుకోవాలి. ఉదయం ఆయిల్ లేకుండా తీసుకోవాలి. 

40నుంచి 50% పండ్లు కూరగాయలను తినాలి. మిగతా యాభై శాతం వండిన ఆహారం తినాలి. వ్యాయామం తక్కువగా ఉండేవారు ఈ డైట్ తప్పకుండ ఫాలో అవ్వాలి. ఈ డైట్ ఫాలో అయిన ఏడోరోజు నుంచే మంచి ఫలితం చూస్తారు. దీనివలన రక్తం శుభ్రపడి ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.

20గ్రాముల ధనియాలు, 10గ్రా సోంపు, రెండు చెంచాల పసుపు,1పెద్ద దాల్చిన చెక్క, పదిగ్రాముల తెల్ల ఆవాలు తీసుకుని పొడిలా చేసుకుని గ్లాసుడు వేడినీటిలో మరిగించి తీసుకోవాలి.అల్పాహారం తర్వాత ఈ డ్రింక్ తీసుకుంటే శరీరంలో పేరుకున్న కొవ్వు మంచులా కరిగిపోతుంది.

Leave a Comment

error: Content is protected !!