How to Reduce Gastric Problems Controls Acidity

గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ తగ్గడానికి నీళ్లలో కరిగే టాబ్లెట్లు చప్పరించే టాబ్లెట్స్ వేసుకుంటున్నారా ?

మనం తిన్న ఆహారం పొట్టలోకి వెళ్ళిన తర్వాత అరగడానికి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ యాసిడ్ ఘాటు ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే 0.8-1.2 మధ్యలో ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్యాస్ట్రైటీస్ కి కారణం  హెచ్ పైలోరియ అని బ్యాక్టీరియా. కొంతమందికి మంచినీళ్లు తక్కువ తాగే అలవాటు ఉంటుంది. ఈ నీళ్లు తక్కువ తాగేటప్పుడు అంచులు వెంబడి జిగురు ఎక్కువగా ఉత్పత్తి కాదు. దీనివల్ల యాసిడ్ ఘాటుని తట్టుకునే శక్తి ఈ లైనింగ్ సెల్స్ కి ఉండదు. కొంతమంది కాఫీ టీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. వీటిలో ఉండే కెఫిన్ వల్ల గ్యాస్ ట్రిక్ వచ్చే అవకాశం ఉంటుంది.

                     కొంతమందికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. దీని వల్ల జిగురు తక్కువ ఉత్పత్తి అయ్యి ఆసిడ్ రిలీజ్ అవుతుంది. కొంతమంది పాంటాసిక్ టాబ్లెట్స్ వాడకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. దీనివల్ల గ్యాస్టిక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది టైంకి తినకుండా ఇర్ రెగ్యులర్గా ఉంటారు. దీనివల్ల గాస్ట్రిక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది  సంబంధించిన కూల్ డ్రింక్స్ పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల గాస్ట్రిక్ కి గురవుతున్నారు. ఈ గ్యాస్టిక్ సమస్య అనేది వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ గ్యాస్ట్రిక్ వచ్చినప్పుడు ముఖ్యంగా కడుపులో మంటగా ఉంటుంది.

                      కొంతమందికి చెస్ట్ బాన్ గా ఉంటుందని కూడా అంటారు. పొట్టలో ఆహారం పడిన ఆఫెన్ హావర్ కి మంట తగ్గిపోతుంది. ఫుడ్ అరిగిన తర్వాత కూడా మంటగా ఉంటుంది. ఆ సమయంలో పాలు గాని మంచి నీళ్లు గాని మజ్జిగ గాని ఏదో ఒకటి తాగి పడుకుంటే మంట తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ వచ్చినవారు ఉప్పు, కారం, పులుపుకు సంబంధించిన వాటికి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే పొట్ట ఖాళీగా ఉంటుందో అప్పుడు యాసిడ్ లైనింగ్ ప్రభావం చూపిస్తుంది. ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గాలి అంటే ముఖ్యంగా మన జీవనశైలిని మార్చుకోవాలి. కాబట్టి నీళ్లు ఎక్కువ తాగుతూ కనీసం రోజుకి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి.

                        కారం మసాలాలు ఉన్న ఆహారాన్ని తక్కువ తీసుకుంటూ ఉంటే గ్యాస్టిక్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ గ్యాస్ట్రిక్ సమస్యను పరిష్కరించాలంటే ఇలా చేయడం వల్లే సాధ్యమవుతుంది.

Leave a Comment

error: Content is protected !!