How To Reduce Hair Fall in Telugu

ఒక్క రాత్రిలో జుట్టు రాలడం ఆగిపోయి పొడవుగా పెరుగుతూనే ఉంటుంది

జుట్టు రాలే సమస్య ఎంతగా ఉందంటే ఎవరైనా మాట్లాడుకునే నాలుగు మాటల్లో ప్రతి ఒక్కరి నోటి వెంట ఒక్కసారైనా జుట్టు రాలిపోతుంది అనే మాట వస్తూనే ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఎన్ని రకాల ప్రోడక్ట్స్ వాడినా జుట్టు రాలిపోతుంది అంటే మన శరీరంలో కొన్ని విటమిన్స్ లోపం, ఖనిజాల లోపాలు ఉండవచ్చు. మొదట వీటిని సరిదిద్దుకొని తర్వాత జుట్టుకు చేయవలసిన చికిత్స బయట నుంచి కూడా చేయాలి. దాని కోసం ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పులను తీసుకోవాలి. 

వీటిలో ఐరన్ పుష్కలంగా ఉండి శరీరంలో రక్తహీనత, హిమోగ్లోబిన్ లోపాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అంత ఖరీదు పెట్టలేనివారు గుప్పెడు పల్లీలు తినండి. వీటి వలన కూడా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. తర్వాత ఆమ్లా జ్యూస్ రోజూ తాగాలి. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉండడంతో పాటు శరీరానికి కావలసిన పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. తాజాగా దొరికినప్పుడు ఉసిరి రసం తాగడంతో పాటు దొరకని సీజన్లో ఉసిరిపొడి 200ml నీటికి ఒక స్పూన్ కలిపి తాగడం ద్వారా జుట్టు రాలే సమస్యను తప్పించుకోవచ్చు.

 ఉసిరి వలన జట్టు పెరగడం నల్లగా, బలంగా రావడం జరుగుతుంది. పిల్లలకి చిన్నప్పటి నుండి ఉసిరి ఇవ్వడం వలన జుట్టు బలంగా, దృఢంగా పెరుగుతుంది. కొంత మంది రోజుకు లీటర్ నీటిని కూడా తాగరు. మీరు నీళ్లు తాగకపోవడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య పెరగవచ్చు. అందుకే రోజుకు మూడు నుండి నాలుగు లీటర్ల నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. నిమ్మ రసం నీటిలో కలిపి తాగడం వలన డీటాక్సిఫికేషన్ తో పాటు శరీరానికి విటమిన్ సి డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది.

అలాగే హోమ్ మేడ్ బయోటీన్ పౌడర్ తీసుకోవడం వలన ప్రొటీన్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అంది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కరివేపాకును కూడా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు. కనీసం వారానికి ఒకసారి హెయిర్ పాక్ అలాగే మంచి హెయిర్ ఆయిల్ అప్లై చేయడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. చాలామందికి కెమికల్ షాంపూ వాడడం వల్ల హెయిర్ ఫాల్ జరుగుతూ ఉండొచ్చు.కెమికల్ షాంపూ నుండి హెర్బల్ షాంపూకి మారాలి.

 ఒక్కసారిగా మారడం వలన ఇబ్బందిగా అనిపిస్తే కనీసం వారానికి ఒకసారి హెర్బల్ షాంపు ఒకసారి కెమికల్ షాంపూ అలవాటు చేసుకుని నెమ్మదిగా కెమికల్ షాంపూను వదిలేయాలి. కుంకుడుకాయలు వాడటం వలన జుట్టు గరుకుగా అవుతుంది అనిపిస్తే కుదుళ్లకు కుంకుడు రసంతో మసాజ్ చేసి  పైపైన షాంపుతో తలస్నానం చేయాలి. కరివేపాకు పొడి  చేసి  కొబ్బరి నూనె, ఆముదం తీసుకొని అందులో కొంచెం దంచిన మెంతులు వేసి నూనె మరిగించాలి. నేను వారానికి రెండు సార్లు తలకు మసాజ్ చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.

Leave a Comment

error: Content is protected !!