How to Reduce Nerves Problems

ఒంట్లో రక్తం పలుచగా అవ్వాలంటే ప్రతిరోజు దీన్ని తాగండి…

వెరికోజ్‌ వీన్స్‌ ఈ పదం గురించి మనకు పెద్దగా తెలియకపోయినా ఈ సమస్యను మాత్రం మనలో చాలా మంది అనుభవిస్తుంటారు. మన కాలి సిరలు ఉబ్బిపోవడం వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటాం. కొందరి కాళ్లపై రక్తనాళాలు ఉబ్బి బయటకు కనపడుతుంటాయి. అవి కాస్త వంకర్లు తిరిగిపోయి ఉంటాయి. బ్లూ కలర్ చారలు బయటకు కనిపిస్తుంటాయి. అవి చూడడానికి కూడా అంత బాగోవు. మనకి వెరికోస్ వీన్స్‌ ప్రారంభ దశలో ఉన్నప్పుడు పాదాలు, వేళ్ల దగ్గర గాని, గుత్తి భాగం దగ్గరగాని రక్తనాళాలు పైకి ఉబ్బి ఎరుపెక్కడం వాపు లాగా రావడం, మెలికల ఉండలు లాగ లక్షణాలు కనబడడం.

                   ఇలాంటి వాటిని వెరికోస్ వీన్స్‌ అని అంటారు. ఇలాంటివి ప్రారంభ దశలో ఉన్నప్పుడు తగ్గించుకోవడం చాలా సులభం. వీటికి ప్రతిరోజు రెండు పూటలా పాదాల వ్యాయామాలు చేయాలి, పిక్కల వ్యాయామాలు మానకుండా తప్పనిసరిగా చేయాలి. ఇలాంటి వ్యాయామాలు చేసినప్పుడు పిక్కల, పాదాల కండరాల బలపడతాయి. ఇలా బలపడినప్పుడు రక్తాన్ని చకచకా పైకి ఎక్కించ్చేస్తాయి. కాబట్టి అక్కడ నిలవ ఉండదు. రక్త నిలవ ఉండదు కాబట్టే వాపులు, ఉబ్బులు రావు. అందుకని రక్తప్రసరణ పైకి ఎందుకు వెళ్లట్లేదు అంటే కండరాలు సోమరిగా మనం కూర్చోవడం వల్ల, కాళ్లు వేలాడదీసి ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల, ఎక్కువసేపు కదలకుండా నిలబడి ఉండడం.

                 దీనివల్ల కండరాలు వీక్ అయిపోయి రక్తంపై కాకుండా కింద నిల్వ ఉండిపోయి నరాలు ఉబ్బడం లాంటివి జరుగుతున్నాయి. దీనికి పరిష్కారం రెండు పూటలా వ్యాయామాలు చేయాలి. ఈ లోపు ఉపశమనానికి పాదాలు కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి. పాదాల కింద పెట్టుకుంటే చాలా హాయిగా ఉంటుంది. కంటిన్యూగా ఐదారు గంటల నుంచి కదలకుండా కాళ్లు వేలాడదీసి కూర్చోవడం గాని మంచిది కాదు. రెండు మూడు గంటల పనిచేయడం తర్వాత ఒక అరగంటసేపుపాదాలు ఎత్తు మీద పెట్టుకొని కూర్చోవడం గాని పడుకోవడం గాని చేయాలి. మల్ల రెండు మూడు గంటలు పనిచేయడం పాదాలు పెట్టి పడుకోవడం.

                  ఇలా చేస్తే రక్తనాళాల్లో పెరిగే ఒత్తిడి తగ్గుతుంది. కోట్లు మంటలు రాకుండా రక్తనాళాలు డెవలప్ అవ్వకుండా రక్తనాళాల డామేజ్ ఆగుతుంది. రక్తం పలిచబడడానికి పండ్లు, జ్యూస్, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. పెద్ద తగ్గిస్తే అంత చిక్కబడడం తగ్గి ఫ్రీగా ఇస్తుంది. ఉప్పు తగ్గించడం వల్ల పోట్లు, మంటలు కూడా తగ్గుతాయి.

Leave a Comment

error: Content is protected !!