How to Reduce Ovarian Cysts Hormone Imbalance

ఇది తీసుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ గా ఉంటుందిపీరియడ్స్ సరైన సమయానికి వస్తాయి

ఈస్ట్రోజెన్ ఒక హార్మోన్.  ఇది శరీరంలో చిన్న మొత్తాలలో ఉన్నప్పటికీ, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో హార్మోన్ల పాత్ర చాలా పెద్దది. ఈస్ట్రోజెన్ సాధారణంగా స్త్రీ శరీరంతో సంబంధం కలిగి ఉంటుంది.  పురుషులు కూడా ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తారు, కానీ మహిళలు దానిని అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తారు.

 హార్మోన్ ఈస్ట్రోజెన్:

 బాలికలు యుక్తవయస్సు వచ్చినప్పుడు వారి లైంగిక అభివృద్ధికి బాధ్యత వహిస్తుంది.

 బుతు చక్రం మరియు గర్భధారణ ప్రారంభంలో గర్భాశయ పొర యొక్క పెరుగుదలను నియంత్రిస్తుంది.

 టీనేజర్స్ మరియు గర్భిణీ స్త్రీలలో రొమ్ము మార్పులకు కారణమవుతుంది.

 ఎముక మరియు కొలెస్ట్రాల్ జీవక్రియలో పాల్గొంటుంది.

 ఆహారం తీసుకోవడం, శరీర బరువు, గ్లూకోజ్ జీవక్రియ మరియు ఇన్సులిన్ సున్నితత్వాన్ని నియంత్రిస్తుంది.

 ఈ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల స్త్రీలలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. సంతాన సమస్యలు, బుతు చక్రంలో సమస్యలు ఏర్పడినప్పుడు పీరియడ్స్ ముందు వెనకలు కావడం, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఉన్నప్పుడు  ఈస్ట్రోజన్ ఉత్పత్తి చేసే ఆహారాలను సహజంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అందులో ముఖ్యంగా సోయాబీన్ ఆహారంలో భాగం చేసుకోవాలి. సోయా చిక్కుళ్ళు 12 గంటల పాటు నానబెట్టి పై పొట్టు తీసేసి కుక్కర్లో ఉడికించి మెత్తగా ఉడుకుతాయి. 

వీటిని మనం తినే కూరలు, ఫ్రైలు, పప్పులలో వేసుకొని తినడం వలన రోజూ మనకు కావలసిన ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ సరైన స్థాయిలో ఉండేందుకు సహకరిస్తుంది. అలాగే సోయాబీన్స్ నానబెట్టి గ్రైండ్ చేసి తీసిన పాలను కూరలో వేసుకోవడం వలన కూడా ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. బయట మార్కెట్లో సోయా పన్నీర్ కూడా అందుబాటులో ఉంటుంది లేదా ఇలా తీసుకున్న పాలతో తయారు చేసుకోవచ్చు. సోయా పాలను తీసుకోవడం , సోయా చంక్స్ (మీల్మేకర) వల్ల కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ పొందవచ్చు. 

అలాగే మొలకెత్తిన విత్తనాలు ఎండు ఖర్జూరం డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ లో సరిచేసుకోవచ్చు. అంత ధర పెట్టి బాదం, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోలేని వారు గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటివి రాత్రి నానబెట్టి ఉదయం పూట తీసుకోవచ్చు. పండ్లరసాలు, పండ్లు, పచ్చికూరగాయలు తీసుకోవడం వలన కూడా ఈ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ లో సరిచేసుకోవచ్చు . రోజులో ఒక గంట వ్యాయామం కూడా హార్మోనల్ ఇన్ బేలన్స్ను సరి చేయడంలో సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!