ప్రస్తుత కాలంలో ఉన్న వాతావరణం బట్టి మరియు పొల్యూషన్ బట్టి మన ముఖం, చర్మం యొక్క రంగు మారిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో చాలామంది మెడ చుట్టూ నల్లగా అవుతుంది అని బాధపడుతూ ఉంటారు. దానికి కారణం మన చర్మంపై ఉన్న డెడ్ సెల్స్ తొలగిపోకుండా నల్లటి మచ్చలుగా ఫామ్ అవుతాయి. అంతేకాకుండా ఇలా మెడ చుట్టూ నల్లగా ఉన్నవారు ముఖ్యంగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ ఉంటే కనుక ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది.
అంతేకాకుండా వాటిని తొలగించుకోవడానికి ఎన్నో కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటున్నాం. వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. మరియు పార్లర్ చుట్టూ కూడా ఎక్కువగా తిరుగుతూ ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం. కానీ వీటి వలన తాత్కాలిక ఫలితం ఉంటుంది. కానీ శాశ్వత ఫలితం ఉండదు. ఇప్పుడు మనం చెప్పిన చిట్కా ఈ పిగ్మెంటేషన్ తగ్గించడంతోపాటు ముఖం యొక్క తేజస్సును కూడా పెంచుతుంది. ఇది నాచురల్ ప్రోడక్ట్ కావున ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. మరియు వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
దీనికోసం మనకు కావాల్సింది బంగాళదుంప లేదా పొటాటో. పొటాటో అనేది మన పిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ బంగాళదుంపని తొక్క తీయకుండా చిన్నచిన్న స్లైసెస్ లాగా చిప్స్ కు కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను పిగ్మెంటేషన్ ఉన్నచోట లేదా నల్లగా ఉన్న మెడ భాగంలో బంగాళదుంప ముక్కలను ఉపయోగించి 15 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఉన్న మృత కణాలు తొలగించబడతాయి. అంతేకాకుండా మసాజ్ వలన ఆ ప్రదేశంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
కనుక ఇలా మసాజ్ చేయడం వలన చర్మం యొక్క తేజస్సు కూడా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా మృత కణాలు తొలగించబడి నల్లటి మచ్చలు తొలగిపోతాయి. మరియు చర్మం సహజ రంగును పునర్మించుకుంటుంది. ఈ బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ ఉండడం వలన మంచి స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది. కనుక ప్రకృతిలో లభించే బంగాళదుంప వంటి వాటిని ఉపయోగించడం వలన మనకు తక్కువ ఖర్చు అవడంతో పాటు మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. దీనితో పాటు రోజు మంచి ఆహారం తీసుకోవడం వలన కూడా ముఖం యొక్క తేజస్సు పెరుగుతుంది