ఈ మధ్య కాలంలో జుట్టు రాలడం సమస్య ప్రతి ఒక్కరికీ చాలా ఎక్కువగా ఉంటుంది దీని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్ ను ఉపయోగిస్తున్నారు. కానీ వాటిలో కెమికల్స్ ఉండటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే జుట్టు రాలడం తగ్గించుకుని జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగే విధంగా చేసుకోవచ్చు. దీని కోసం మనం ముందుగా బియ్యం రెండు సార్లు కడిగిన తరువాత ఎసరు పెట్టిన నీటిని ఒక పొంగు వచ్చిన తరువాత తీసుకొని గాజు కంటైనర్ లో ఒక రాత్రి మొత్తం పులియబెట్టుకోవాలి.
పులియబెట్టిన రైస్ వాటర్ ఒక బౌల్లో తీసుకొని ఒక కప్పు నీళ్లకు ఒక చెంచా కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. కొబ్బరి నూనె వద్దు అనుకున్న వాళ్లు బాదం నూనె కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకునే వారు అయితే నూనె వేసుకోకపోయినా పర్వాలేదు. బాగా కలిపిన తరువాత ఈ నీటిని ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకొని తల స్నానం చేయడానికి ముందు జుట్టు మొత్తం స్ప్రే చేసుకోవాలి. కుదుళ్ల దగ్గర ఐదు నుంచి పది నిమిషాలపాటు మసాజ్ చేసుకోవాలి. మస్సాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
అప్లై చేసిన తర్వాత ఒక గంట పాటు ఉండనివ్వాలి. తర్వాత ఏదైనా హెర్బల్ షాంపూ లేదా హోం మేడ్ షాంపూ తో తలస్నానం చేయాలి. తల స్నానం చేసిన తర్వాత అప్లై చేసుకోవడం కోసం నాచురల్ హెయిర్ కండిషనర్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని కోసం మనం కలబంద మట్టని తీసుకుని శుభ్రంగా కడిగి అంచులను తీసేసి మధ్యలో ఉన్న జిగురు పదార్ధాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకొని మెత్తగా ఉండే పదార్థాన్ని తీసుకోవాలి. దీనిలో విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసి బాగా కలుపుకోవాలి. తల స్నానం తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఎటువంటి హెయిర్ డ్రైయర్ ఉపయోగించకూడదు. ఇలా చేయడం వలన జుట్టు చాలా సాఫ్టుగా, సిల్కీ గా మారుతుంది. జుట్టు చిక్కులు పడటం కూడా తగ్గుతుంది. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.