How to Relieve Muscle Cramps

కండరాల తిమ్మిర్లు, క్రాంప్స్ తగ్గాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

పారిజాత మొక్క ఈ మొక్క ప్రతి ఒక్క ఇంటికి లేదా రెండు ఇళ్లకు ఒకటి చొప్పున ఉంటూనే ఉంటుంది. పారిజాత పువ్వులు శివునికి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. పారిజాత వృక్షం ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా పిలవబడుతుంది. పారిజాత మొక్క వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పారిజాత మొక్క ఆకులను ఆరు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి ఉదయం ,సాయంత్రం 50mlచొప్పున తీసుకోవడం వలన కండరాల నొప్పి , నడుము నొప్పి ,పిక్కలు పట్టుకోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. 

ఎండిన పారిజాత ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయం, సాయంత్రం తీసుకోవడం వలన గాస్త్రిక్ ,అల్సర్ వంటి సమస్యలు  తగ్గుతాయి. నాలుగు నుంచి ఐదు తిప్పతీగ ఆకులను ,ఆరు పారిజాత ఆకులను గ్లాస్ నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని తీసుకోవడం వలన అన్ని రకాల క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు. ఇలా మూడు నుంచి ఆరు నెలల పాటు తీసుకున్నట్లయితే క్యాన్సర్ నుండి చూసుకోవచ్చు. పారిజాత గోళీలు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి . 

వాటిని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవడం వలన ఇన్సులిన్ తీసుకునే స్టేజ్ లో ఉన్న షుగర్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది. పారిజాత ఆకుల రసం తీసుకోవడం వలన షుగర్, బీపీ కంట్రోల్ లోకి వస్తాయి. దీంతో పాటు ఆహార నియమాలు కూడా పాటించినట్లయితే మూడు నెలల్లో షుగర్ తగ్గుతుంది. పారిజాత పువ్వులను దంచి రసం తీసి రసం చెవిలో ఒక చుక్క చొప్పున వేసుకోవడం వల్ల వినికిడి సమస్యలు ,చెవిపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. 

పారిజాతం ఆకుల కషాయాన్ని చేసుకొని తాగడం వల్ల  కాళ్ళు పట్టుకోవడం, కాళ్ల నొప్పి ,నడుము నొప్పి, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. రోజుకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి జ్వరం వచ్చే వాళ్ళు ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల జ్వరం తగ్గుతుంది . పారిజాత ఆకుల కషాయం అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలకు కూడా తగ్గిస్తుంది . మల బద్ధకం సమస్య ఉన్నవారు ఈ ఆకుల కషాయాన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అందుకే పారిజాత ఆకులను ఆయుర్వేదంలో దివ్యౌషధంగా పిలుస్తారు . ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మీరు కూడా పారిజాతం వృక్షం ప్రయోజనాలు తెలుసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు .

Leave a Comment

error: Content is protected !!