How to remove blackheads permanently at home in telugu

ముఖం మీద నల్లమచ్చలకు అద్భుతమైన చికిత్స మనమే చేసుకుందాం ఇలా………

ఎండలో తిరిగి తిరిగి వచ్చింది, ఆ ముఖం చూడు నల్లగా ఎలా అవుతోందో… అని ఇంట్లో వాళ్ళు మనల్ని ఎండలో తిరిగినందుకు మందలిస్తూ ఉంటారు. నిజమే కదా…. ఎండలో అల్ట్రావాయిలెట్ కిరణాల రియాక్షన్ వలన నుదురు మీద, కంటి చుట్టూ, బుగ్గలమీద నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. చూసుకుంటే మాడిన దోశ లాగా నల్లగా ఉంటుంది అక్కడి చర్మం.

       ఇది రావడానికి వయోభేదం అంటూ ఏమీ లేదు, ఆడవారికైనా రావచ్చు, మగవారికైనా రావచ్చు. మొటిమలొచ్చే వయసులో ఉన్నవారికి మరింత ఎక్కువగా రావచ్చు కూడా! వేసవికాలం అయిపోయిన తరువాత సాధారణంగా ఈ నలుపు తగ్గిపోతూ ఉంటుంది.  అలాగని తగ్గాలనే నియమం కూడా ఎందుకంటే మన జీవితంలో ఎండ అనేది ఒక భాగం. అది లేకపోతే వచ్చే జబ్బులు వ్యాధులు ఇంకా ఎక్కువగా బాధపెడ్తాయి.

ఎండ శరీరానికి తగలడం వల్ల మెలనిన్ అనే పదార్థాన్ని మన చర్మం తయారుచేసుకుంటుంది. ఇది ఎక్కువ అయితే దీన్నే మనం పిగ్మెంటేషన్ అంటాము. చర్మానికి పైపొర లోనే ఈ మెలనిన్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి దేశని తొలగించే కొన్ని అద్భుతమైన  ఔషధాలు ఉన్నాయి. బయట వైద్యులు స్టిరాయిడ్ కు సంబందించిన బెట్నోవేట్, కొటారిల్ హెచ్ వంటి అయింట్మెంట్లను సూచిస్తూ వుంటారు. అయితే వీటిని వైద్యులకు వదిలేసి మనకు మనం తీసుకోగలిగే జాగ్రత్తలు మరియు చిట్కాలు గూర్చి చూద్దాం.

◆ పుల్లటి మజ్జిగతో ముఖం కడుక్కుంటే మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం పై పోరల్ని మృదువు పరుస్తుంది. దీనివల్ల చర్మపు పై పొరల్లో కణాలను తొలగించేందుకు ఉపయోగించే ఔషధాలు చక్కగా పనిచేస్తూ త్వరగా ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల నలుపు నల్లమచ్చలు తొందరగా తగ్గిపోతాయి.

◆ నిమ్మరసంలో వేలు ముంచి నల్ల మచ్చల మీద సున్నితంగా మర్దనా చేయాలి.నిమ్మ ఉప్పు అందుబాటులో ఉంటే దాన్ని కూడా ఉపయోగించవచ్చు అయితే నిమ్మ ఉప్పు లేని పక్షంలో  నిమ్మరసం ఉపయోగించవచ్చు.ఇలా చేయడం వల్ల జిడ్డు కారడం తగ్గుతుంది.

◆ క్యారెట్, కీరదోస, బీర, ద్రాక్ష, కమల, నారింజ, టమాటా, ఉసిరికాయ వంటి వాటి ముక్కలను లేదా రసాన్ని నల్లని చర్మం మీద రుద్దుతూ ఉంటే నలుపు తగ్గిపోయి అవకాశం ఎక్కువగా ఉంటుంది.అయితే మొటిమల ద్వారా వచ్చే పుండ్ల మీద ఇలా చేస్తే మాన్తా నొప్పి వల్ల వాటి పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త.

◆ పుల్లని పెరుగును పట్టించి కాసేపు అలానే ఉంచి ఆరనిస్తే చర్మం బాగా మెత్తబడి చర్మం మీద నలుపు క్రమంగా తగ్గుతుంది. 

◆ సి విటమిన్ ఎక్కువగా కలిగిన పళ్లరసాలు ముఖ్యంగా టమాటా రసం  తరచూ తీసుకుంటూ ఉంటే, ఇది ఎండ వల్ల చర్మం కు ఎలాంటి హాని కల్గకుండా కాపాడుతుంది. అందుకే విటమిన్ సి ని సన్ స్క్రీన్ ఏజెంట్ గా వ్యవహరిస్తారు. యాపిల్, ద్రాక్ష, కమల, బత్తాయి, జామ మొదలైనవాటిలో విటమిన్ సి ఉంటుంది. వీటిని నేరుగా తినడం లేదా జ్యుస్ గా అయినా తీసుకోవడం ఉత్తమం.

◆ సుగంధిపాలవేళ్ళు లభించిన వారు వాటిని ఎండించి మెత్తగా పొడి చేసుకుని  ఆ పొడిని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పాలలో వేసి మరిగించి గానీ, లేక నీళ్లలో వేసి మరిగించి కషాయము గా గాని తాగుతూ ఉంటే చర్మాన్ని రక్షించడమే కాకుండా నలుపు పోయి మంచి ఏఅంగు ఏర్పడి చర్మం కూడా యవ్వనంగా అవుతుంది.కాబట్టి సుగంధిపాలవేళ్ళు అందుబాటులో ఉన్నవారు టప్పనిసరిగా వాడుకోవడం మంచిది.

చివరగా…….

పైన చెప్పుకున్నవే కాకుండా సూర్యకాంత రసం, శారిబాదివటి, శరిబాద్యరిష్ఠ, గంధకరసాయనం, పంచత్తిక గుగ్గులు ఘృతం వంటి ఔషదాలను ఆయుర్వేద పండితులు, లేక వైద్యుల సలహాతో వాడటం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!