How to remove eye dark circles at home naturally in telugu

రెండు రోజుల్లో కంటి కింద నల్లటి మచ్చలు, డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవచ్చు

మన జీవితాల్లోకి టెక్నాలజీ దూసుకు వచ్చిన తర్వాత ఫోన్లు, లాప్టాప్లు ఉపయోగం బాగా ఎక్కువైంది. దాని వలన కంటి చుట్టూ నల్లటి సర్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ డార్క్ సర్కిల్స్ చూడడానికి అంతగా బాగుండవు. ఇవి ముఖం యొక్క అందాన్ని చెడగొట్టడంతో పాటు మనలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కారణమవుతూ ఉంటాయి. వీటి నివారణకి సరైన ప్రొడక్ట్స్ మార్కెట్లో కూడా అందుబాటులో లేవు. కానీ వీటిని మనం ఇంట్లో ఉండే పదార్థాలు వినియోగించి తయారుచేసే ఈ ఒకే ఒక్క చిట్కాతో పూర్తిగా ఈ సర్కిల్స్ తగ్గించుకోవచ్చు.

 ఈ చిట్కా కోసం మనం ఒక స్పూన్ కాఫీ పౌడర్  తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ తేనె, అర స్పూన్ అలోవెరా జెల్ కూడా కలపాలి. దీనిని రోజ్ వాటర్తో చిక్కని పేస్ట్లా చేసి కంటికింద మరియు కంటి చుట్టూ ఉండే నల్లటి మచ్చలపై అప్లై చేయాలి. ఒక పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రెండు రోజులకొకసారి చేయడం వలన కంటి కింద నల్లటి మచ్చలను తగ్గించుకోవచ్చు. కంటి చుట్టూ నల్లగా మారకుండా ఫోన్లు, లాప్టాప్ ల నుండి విశ్రాంతి ఇస్తూ ఉండాలి. కనీసం ఇరవై నిమిషాలకు ఒకసారి ఒక ఐదు నిమిషాల పాటు కంటిని మూసి ఉంచాలి.

 ఇలా కళ్ళు మూసి ఉంచడం వలన కళ్లకు విశ్రాంతి లభిస్తుంది. పడుకునేటప్పుడు కీరా ముక్కలను కళ్లపై పెట్టుకోవడం వలన కళ్ళలో నుండి వేడి తగ్గి కళ్ళ చుట్టూ నల్లగా మారకుండా ఉంటుంది. కళ్ల మంటలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా చేతివేళ్లలోని ఉంగరపు వేళ్ళతో మసాజ్ చేయడం వలన కంటి చుట్టూ ఉండే నరాలు శాంతపడి అవి దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఈ టిప్లో వాడిన పదార్ధాలన్నీ కంటి చుట్టూ చర్మాన్ని తేలికపరచి చర్మాన్ని నల్లగా మారకుండా కాపాడుతాయి.

 కాఫీ పౌడర్ చర్మ రంగును తెల్లగా చేయడంలో సహాయపడితే,  తేనె చర్మంలో తేమను కాపాడుతుంది. రోజ్వాటర్ చర్మాన్ని మురికి, నలుపుదనం పోయేందుకు సహాయపడుతుంది. శెనగపిండి గురించి మనందరికీ తెలిసిందే. ఇది చర్మాన్ని టైట్ గా చేయడంతోపాటు చర్మ రంగును మెరుగు పరుస్తుంది. చర్మంపై సన్నటి లైన్స్ ఏర్పడకుండా ఈ టిప్స్ మరియు ఎక్సర్సైజ్లు చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు చెప్పిన చిట్కాలు పాటిస్తూ కంటి చుట్టూ ఉన్న నల్లటి సర్కిల్ తొలగించుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!