How To Remove Pigmentation Dark Patches Around Mouth

మూడురోజుల్లో నల్ల మచ్చలు మంగు మచ్చలు మూతి చుట్టూ నలుపుదనం పోయి తెల్లగా మెరిసిపోతారు

చాలామందికి మూతి చుట్టూ లేదా బుగ్గలపై పిగ్మెంటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖం ఎంత అందంగా ఉన్నా ఇలా పిగ్మెంటేషన్ ఉండడం వలన ఆ మచ్చ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అసలు పిగ్మెంటేషన్ కి ముఖ్య కారణం శరీరంలో మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం, ఎక్కువగా ఎండలో తిరగడం, ఒత్తిడి కూడా పిగ్మెంటేషన్ కి కారణం అవుతున్నాయి. దీనికి డెర్మటాలజిస్ట్ ఇచ్చే చికిత్సలు ఖరీదైనవి మరియు అందరికీ అందుబాటులో ఉండవు. 

 కానీ ఇంట్లోనే కొన్ని రకాల చిట్కాలతో పిగ్మంటేషన్ తగ్గించుకోవచ్చు. దాని కోసం మనం తీసుకోవాల్సినవి శెనగపిండి, పెరుగు, టమాటాలను తురిమి తీసుకున్న టమాట జ్యూస్. ఈ మూడింటినీ ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. కలపడానికి అవసరం అయితే  ఇంకా కావాలి అనుకుంటే టమాట జ్యూస్ కొంచెం కలుపుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలో ఒక స్పూన్ అలోవెరా జ్యూస్ వేసుకోవాలి. అందులో ఒక స్పూన్ తీపి బాదం ఆయిల్ వేసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

 పిగ్మెంటేషన్ ఉన్నచోట పెరుగు, శెనగపిండి మిశ్రమాన్ని అప్లై చేసి కొంత సేపు ఆరనివ్వాలి. ఇది కొంచెం ఆరిన తరువాత కొద్దిగా వాటర్ తో కలిపి స్క్రబ్ చేయాలి. స్క్రబ్ చేసిన తరువాత శుభ్రం చేసి దాని మీద అలోవేరా, ఆల్మండ్ ఆయిల్ క్రీం రాయాలి. ఇలా కనీసం మూడు రోజుల పాటు ఈ పద్ధతిని పాటించడం వలన పిగ్మెంటేషన్ పోతుంది. పిగ్మెంటేషన్ పూర్తిగా పోయేంతవరకు ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి. ముఖంపై ఉండే నల్లటి మచ్చలు, మొటిమలు మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది.

 దీనిని పూర్తి ముఖానికి ప్యాక్లా వేసుకుని కూడా వాడుకోవచ్చు అలోవెరా, బాదం ఆయిల్ మిశ్రమం అప్లై చేయడం వలన చర్మం కోల్పోయిన సహజ తేమని తిరిగి అందిస్తాయి. పొడి చర్మం వారికి చర్మం మరింత పొడిబారకుండా ఆపుతుంది. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచి మృదువుగా, మచ్చరహితంగా చేస్తుంది. ఇంత సింపుల్గా ఉన్నా ఈ పద్ధతిని పాటించి ముఖంపై వచ్చే పిగ్మెంటేషన్ మచ్చలు తొలగించుకోండి.

Leave a Comment

error: Content is protected !!