how to remove pigmentation on face

జపనీస్ సీక్రెట్ ..మీ ముఖంపై మంగు మచ్చలు,నలుపు తెల్లమచ్చలు,మొటిమలు,పిగ్మెంటేషన్ ను తొలగించే టిప్స్

చర్మం పై నల్ల మచ్చలు కనిపించడం, ఎక్కువగా సీతాకోకచిలుకలా ముక్కు పక్కన నల్ల మచ్చలు ఉండడం, అలాగే చాలామందికి ఎక్కువగా మొటిమలు ఉండడం, తెగిపోయిన  మచ్చలు ఉండిపోయి, పిగ్మెంటేషన్ చిరాకుగా కనిపిస్తుంటాయి. దీన్నే మరో పదంలో హైపర్ పిగ్మెంటేషన్ కూడా అంటారు. ఇది ఒక రకమైన చర్మ సమస్య. ఈ కాలంలో చిన్న వారికి, పెద్ద వారికి మీ చర్మంపై నల్లమచ్చలు అనేది పెద్ద సమస్యగా మారాయి. ఒక్కోసారి ఈ మచ్చలు వల్ల మన ఆత్మ విశ్వాసం కూడా దెబ్బతింటుంది. ఇలా మెలనిన్ ఎక్కువగా వచ్చే నల్లమచ్చలుకి మన ఇంట్లోనే చికిత్స ఉంటుంది. 

దీనికోసం 2 దశలలో చికిత్స చేయాలి. మొదటి దశలో దీనికోసం స్క్రబ్ ని తయారు చేసుకోవాలి. రెండవ దశలో ప్యాక్ ని తయారు చేసుకోవాలి. దీనికోసం రెండు స్పూన్ల పెరుగు తీసుకుని, రెండు స్పూన్ల పంచదార పొడిని, అర చెక్క నిమ్మరసం తీసుకోవాలి. మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడుగుక్కోవాలి ముందు. తర్వాత పెరుగు ముఖంపై ప్యాక్లా అప్లై చేసుకొని ఈ ప్యాక్ ఆరిన తర్వాత పంచదార పొడిలో నిమ్మరసం అర చెక్క పిండి అదే నిమ్మచెక్కతో ముఖంపైన స్క్రబ్ చేసుకోండి. ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు చేయాలి.మచ్చలు ఎక్కువ అయినప్పుడు మనం డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. డాక్టర్లు ఎక్కువగా కెమికల్ పీల్ కానీ, లేజర్ చికిత్స గాని సూచిస్తారు. వీటి వలన ప్రయోజనం ఉంటుంది. కానీ చాలా ఎక్కువ ధర ఉంటుంది.

ఇంట్లోనే కొన్ని పదార్థాలతో తగ్గించుకోగలిగినప్పుడు ఒకసారి ప్రయత్నించి చూడండి. అయితే ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ ఉపయోగించుకొని తగ్గించుకోవచ్చు.  పెరుగు చర్మానికి నాచురల్ ఎక్స్ట్రాట్ గా పనిచేస్తుంది చర్మంపై ఉండే పిగ్మెంటేషన్ మచ్చలను సహజంగా తొలగించడానికి సహాయపడతాయి. పంచదార కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇది ఒక సహజ ఆల్ఫా ఎక్స్ట్రా లికర్ యాసిడ్. ఇది కూడా కెమికల్ పీల్గా పనిచేస్తుంది. ముఖంపై ఉండే మచ్చలు తొలగిస్తుంది. నిమ్మరసంలోని యాంటీఆక్సిడెంట్లుతో కలిసి ముఖంపై ఉండే మచ్చలు తెల్లగా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు నల్ల మచ్చలతో పోరాడుతాయి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒక స్పూన్ చందనం పౌడర్ తీసుకొని అందులో   సరిపడా బంగాళదుంప రసం కలుపుకోవాలి. 

అందులో చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. చందనం అనేది చర్మంలోని అనేక సమస్యలను తగ్గిస్తుంది. ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. ముఖ్యంగా పిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.  బంగాళదుంప లో ఉండే సహజ బ్లీచింగ్ ఏజెంట్స్ ముఖాన్ని తెల్లగా చేయడంలో సహాయపడతాయి. చనిపోయిన చర్మకణాలను రిప్లేస్ చేయడంలో చందనం , బంగాళదుంప చాలా బాగా సహాయపడుతాయి పసుపు ముఖంపై ఉండే బాక్టీరియా ఇన్ఫెక్షన్ను తగ్గించి ముఖం కాంతివంతంగా తయారవడానికి దోహదపడుతుంది. ఈ ప్యాక్ను ఎక్కడైతే మచ్చలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ రాసుకొని ఆరేంతవరకు ఉండి తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. మంచి ఫలితం వచ్చేంతవరకు రోజూ ఉపయోగించవచ్చు కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు

Leave a Comment

error: Content is protected !!