శరీరంపై పులిపిర్లు అనేది చాలా మందికి ఉంటాయి. ఇవి కళ్ళు , చేతులు, ముఖం, మెడ లేదా శరీరమంతటా ఎక్కడో దగ్గర ఎక్కువగా ఉంటాయి. వీటికి కారణం వైరస్. ఒక వైరస్ వలన పులిపిర్లు అనేవి టీనేజ్ లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిని చికిత్స ద్వారా తొలగించుకోవచ్చు. కానీ అది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఇంట్లోనే తొలగించుకోవడానికి కొన్ని పదార్థాలతో తయారు చేసుకునే చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని తొలగించుకోవడం కోసం మనం చేయవలసిన చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అవిస గింజలు పులిపిర్లు తొలగించడంలో చాలా బాగా సహాయపడుతాయి. దానికోసం అవిసగింజల నూనెలో పేస్ట్ చేసిన అవిసె గింజలను, తేనెను కలిపి పులిపిర్లు ఉన్నచోట పూయాలి. దానిపై బ్యాండేజీ కట్టి సాయంత్రం వరకు అలానే ఉంచాలి. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి. అలాగే పైనాపిల్ను కూడా పులిపిర్లుపై అప్లై చేస్తే పులిపిర్లు రాలిపోతాయి. అంజీర పండు రసం లేదా చెట్టు నుండి పండు పంపినపుడు వచ్చి పాలను పులిపిర్లు పై అప్లై చేస్తే పులిపిర్లు రాలిపోతాయి. వెల్లుల్లిని దంచి ఆ పేస్ట్ ను పులిపిరులపైన అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది.
అలాగే ఉల్లిపాయ రసం తీసుకుని అందులో రాళ్ల ఉప్పు కలపాలి. మిశ్రమాన్ని దూదితో పులిపిర్లు పై రోజుకు మూడుసార్లు వరకు రాయడం వలన పులిపిర్లను నివారించుకోవచ్చు. ఉల్లిపాయతో మరొక చిట్కా ఏంటంటే వెనిగర్లో ఉల్లిపాయ ముక్కలు వేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఉల్లి ముక్కలతో పులిపిర్లుపై రుద్దితే కొన్ని రోజులకు పులిపిర్లు రంగుమారి క్రమంగా రాలిపోతాయి. అలాగే కొబ్బరి నూనెలో ఒక స్పూన్ తీసుకుని అర స్పూన్ బేకింగ్ సోడా, రెండు కర్పూరం బిళ్ళలు కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
ఈ క్రీమ్ ను పులిపిర్లుపై అప్లై చేస్తూ ఉంటే రెండు, మూడు వారాల్లో గమనించవచ్చు. అలాగే అరటిపండు తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో అక్కడ టేపుతో అంటించి రాత్రంతా ఉంచాలి. ఇలా కొన్ని రోజులు చేయడం వలన పులిపిర్లు రాలిపోతాయి. తరువాత ఆముదం కూడా పులిపిర్లు రాలిపోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. వాట్స్ ఉన్నచోట ఆముదం రాయడం వలన పులిపిర్లు ఎలా తగ్గించుకోవచ్చు. పాన్ ఉపయోగించి సున్నం కూడా పులిపిర్లు రాలిపోవడానికి చాలా బాగా సహాయపడుతుంది.
దీనిని ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో అక్కడ అంటించడం వలన పులిపిర్లు తగ్గించుకోవచ్చు. కానీ ఇతర ప్రాంతాలకు అంటుకోకుండా జాగ్రత్తపడాలి. ఉసిరి రసం కూడా పులిపిర్లను తగ్గించడానికి సహాయపడుతుంది. ఉసిరిని దంచి ఆ రసాన్ని పులిపిరి ఉన్నచోట పూయాలి. కర్పూరం కూడా పులిపిర్లును తగ్గించడానికి సహాయపడుతుంది. దానిని పొడిగా చేసి పులిపిరి ఉన్నచోట పూయడం ద్వారా తగ్గించుకోవచ్చు. ఇలా ఈ చిట్కాలను ఉపయోగించి ఈజీగా పులిపిర్లను తగ్గించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అతి తక్కువ ధరలో మంచి ఫలితాలను అందిస్తాయి ఈ చిట్కాలు.