how to remove unwanted hair permanently at home naturally

వాజిలెన్ తో ఇలా చేస్తే మీ అవాంఛితరోమాలు పూర్తిగా రాలిపోతాయి

అవాంఛిత రోమాలు చర్మంపై ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ త్రెడ్డింగ్ వంటి పద్ధతుల్లో తొలగిస్తూ ఉంటాం. కానీ మళ్లీ కొన్ని రోజుల్లోనే తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే తొలగించిన ప్రదేశం నల్లగా మారి చూడడానికి అంత బాగుండదు. ముఖ్యంగా ఈ సమస్య ఉద్యోగినులు, కాలేజీకి వెళ్లేవారు అనుభవిస్తూ ఉంటారు. వీటిని శాశ్వతంగా తొలగించుకోవడానికి ఇప్పుడు 2 చిట్కాలు తెలుసుకోబోతున్నాం. మొదటి చిట్కా కోసం బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. దీనిని మనం కేకులు, బిస్కెట్లు వంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. దీన్ని సోడియం బైకార్బొనేట్ అంటారు. దీనిని కప్పులో ఒక స్పూన్ తీసుకొని దీనిలో ఒక స్పూన్ కాచి చల్లార్చిన నీటిని వేసుకోవాలి. 

ఇందులో నురగలు వస్తాయి. అవి తగ్గిన తరువాత ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే షేవింగ్ లేదా వ్యాక్సింగ్ చేశారో ఆ ప్రదేశంలో కాటన్ సహాయంతో అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల ఆ ప్రదేశంలో ఉండే రోమాలు బలహీనపడతాయి. కుదుళ్ళ నుంచి బలహీనపడిన వెంట్రుకలు నెమ్మదిగా రాలిపోతాయి. షేవింగ్, వ్యాక్సింగ్ వల్ల నల్లబారిన చర్మం తిరిగి తెల్లగా మారుతుంది. అలాగే మరొక చిట్కా కోసం ఒక గిన్నెలో ఒక స్పూను పెట్రోలియం జెల్లీ తీసుకోవాలి. దీనిలో మీ శరీరానికి సరిపడినంత పసుపు ఒక టీ స్పూన్ లేదా అర స్పూన్ వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపితే జిగురుగా ఉండే ఒక మిశ్రమం వస్తుంది. ఈ మిశ్రమాన్ని కాటన్తో షేవింగ్ చేసిన ప్రదేశంలో అప్లై చేయాలి.

 ఇలా తరచూ చేయడం వల్ల షేవింగ్ వల్ల దెబ్బతిన్న చర్మం తిరిగి నిర్మించుకొని తెల్లగా మారుతుంది. వెంట్రుకలు బలహీనపడి పూర్తిగా రాలిపోతాయి. కనీసం ఒక నెల రోజుల పాటు ఈ చిట్కాలు పాటించటం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ చర్మానికి ఈ పదార్థాలు పడతాయో లేదో తెలుసుకోవడానికి మీ చర్మం పై వాడడానికి ముందు చిన్న పాచ్ టెస్ట్ చేయండి. ఇది అలర్జీలు, దురదలు వంటి సమస్యల నుండి ముందస్తు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది. 

Leave a Comment

error: Content is protected !!