ముఖానికి ఫేషియల్, మేకప్ ఎన్నిచేసినా కూడా అవాంచిత రోమాలు ఉంటే పైపెదవి, గడ్డం, చెవి పక్కగా ఉండి ఇబ్బంది కలిగిస్తాయి. శరీరంలో హార్మోనల్ ఇన్బాలన్స్ , టెస్టోస్టిరాన్ అసమానతలు, జన్యుపరంగా ఉండే సమస్యలు ఇలాంటి కారణాలతో అవాంచిత రోమాలు పెరుగుతాయి. ఇలాంటి రోమాలను త్రెడింగ్, ప్లకింగ్ వంటి నొప్పి కలిగించే పద్థతులతో నిర్మూలించినా ఇవి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. వీటిని సహజ ఇంటి నివారణా పద్దతులతో కూడా తగ్గించుకోవచ్చు.
దానికోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఒక స్పూన్ గోధుమపిండి, ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ మోలేటి పౌడర్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న పదార్థాలను ఒక స్పూన్ తేనె, కొంచెం రోజ్ వాటర్తో కలుపుకోవాలి. గోధుమపిండి ముఖంపై చిన్న చిన్న రోమాలు తొలగించడంలో, చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.
శనగపిండి చర్మాన్ని ముడతలు, సన్నటి లైన్స్ రాకుండా బిగుతుగా చేస్తుంది. చర్మంపై పేరుకున్న మురికి, జిడ్డు తొలగించడంలో సహాయపడుతుంది.
ముఖంపై జుట్టును తొలగించడానికి శనగ పిండి మరియు రోజ్ వాటర్ చాలా మంచి కలయిక.
శనగపిండి కూడా మనందరికీ సౌందర్య రక్షణలో బాగా తెలిసిన పదార్ధం, ఇది గొప్ప ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు రోజ్ వాటర్ యొక్క మంచితనంతో కలిపి, ఇది జుట్టు పెరుగుదలను నిరోధిస్తుంది. శనగ పిండి మరియు రోజ్ వాటర్ కలిపి ముఖ జుట్టును తొలగించడానికి సహాయపడతాయి.
మోలేటి పౌడర్ ముఖంపై చర్మాన్ని అందంగా చేయడానికి మురికిని తొలగించడానికి సహాయపడుతుంది. తేనె ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగించడంలో, రోమాలను శాశ్వతంగా తొలగించి తిరిగి పెరగకుండా అడ్డుకుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం గట్టి పేస్ట్లా చేసుకుని ఎక్కడైతే ఫేసియల్ హెయిర్ ఉందో అక్కడ రాయాలి. ఆరేంతవరకూ అలా వదిలేయాలి.
ఆరిన తర్వాత కిందనుంచి పైకి ఈ ప్యాక్ని నలపడం వలన అవాంచిత రోమాలు తొలగిపోతాయి. ఇలా చేసిన తర్వాత పటికబెల్లం ముక్కతో ముఖాన్ని మసాజ్ చేయాలి. పటిక కూడా అవాంచిత రోమాలు తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇలా కనీసం నెలరోజుల చేయడం వలన అవాంచిత రోమాలు సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. మళ్ళీ జన్మలో రాదు.