How to Shrink Earholes at home

ఎంత సాగిపోయిన చెవి రంధ్రమైన 5 సెకండ్లలో చిన్నగా మార్చుకోవచ్చు

 కొంతమందికి చెవి రంధ్రాలు పెద్ద చెవిలి లేదా బరువుగా ఉన్నవి పెట్టుకోవడం వలన రంధ్రాలు పెద్దగా సాగిపోతాయి. కానీ పార్టీలకి, ఫంక్షన్స్ కి వెళ్ళినపుడు అందంగా కనిపించడం కోసం పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాము. కానీ చెవి రంధ్రాలు పెద్దవిగా ఉండటం వలన వేలాడిపోయినట్లు ఉంటాయి. ఇలా చెవి రంధ్రాలు సాగిపోవడం వలన కొంతమంది హాస్పిటల్కి వెళ్లి కుట్లు వేయించుకుంటారు. కొంతమంది మొత్తానికి పెద్దగా ఉండే చెవిలి పెట్టుకోవడం మానేస్తారు.

       హాస్పిటల్ చుట్టూ తిరగనవసరం లేకుండా, మీకు ఇష్టమైనవి వదులుకోకుండా మీ చెవి రంధ్రాలను చిన్నగా మార్చుకోవచ్చు.  ఈ రెండు చిట్కాలను ఉపయోగించి చెవి రంధ్రాలు చిన్నవిగా చేసుకోవచ్చు. మొదటి చిట్కా కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక చెంచా మైదా పిండి వేసుకోవాలి. తర్వాత దీనిలో అరచెంచా బేకింగ్ సోడా వేసుకోవాలి.  తర్వాత దీనిలో ఒక చెంచా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. రాత్రి పడుకునే ముందు చెవి రంధ్రాలకు అప్లై చేసి పడుకోవాలి. 

    ఇలా వరుసగా మూడు రోజులపాటు చేసినట్లయితే చెవి రంధ్రాలు చిన్నగా అవుతాయి. ఎంత సాగిపోయిన రంధ్రాలు  అయినా సరే చిన్నగా అవుతాయి.రెండవ చిట్కా దీనికోసం ఒక బౌల్ తీసుకుని కొంచెం కోల్గేట్ పేస్ట్ తీసుకోవాలి. వైట్ పేస్ట్ ఏదైనా సరే యూస్ చేయొచ్చు. దీనిలో అరచెంచా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ రెండిటిని బాగా కలుపుకుని సాగిపోయిన చెవి రంధ్రాలకు అప్లై చేసుకోవాలి. బేకింగ్ సోడా చెవి రంధ్రాలు చిన్నగా చేయడంలో సహాయపడుతుంది.

      ఈ చిట్కా కూడా మూడు నుండి ఏడు రోజులలో చెవి రంధ్రాలని చిన్నగా చేస్తుంది. అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్ కి లేదా పార్టీకి వెళ్ళాలి అనుకున్నపుడు ఈ టిప్ ట్రై చేయండి. చాలా బాగా పని చేస్తుంది. చెవి రంధ్రాలు పెద్దగా ఉండే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు వేలాడుతున్నట్లు ఉండకూడదు అనుకునే వారికి ఈ టిప్ చాలా బాగా పని చేస్తుంది. మనం అలా చెవి రంధ్రాలు చిన్నగా ఉండాలంటే ఆన్లైన్ లో ఇయర్ లూబ్ అనే ప్రొడక్ట్ దొరుకుతుంది. 

       ఇది చూడటానికి టేప్ లాగా ఉంటుంది.దానిని తీసుకుని చెవి వెనుక భాగంలో రంధ్రాన్ని కవర్ అయ్యేలా అంటించుకోవాలి. తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన చెవి రంధ్రాలు సాగిపోయినట్లుగా కనిపించవు.మీకు చిట్కాలు చేసుకోవడానికి టైం లేదు అనుకున్న వారు ఇది ట్రై చేయండి. 

Leave a Comment

error: Content is protected !!