How to Speed Weight Loss

అధికబరువును తగ్గించే సింపుల్ నాచురల్ టెక్నిక్..

అధికబరువు ఎంత పెద్ద సమస్యగా మారిందంటే మనుషులను తమలో తాము కృంగిపోవడం ఒకవైపు అయితే, అధికబరువు వలన వచ్చే ఆరోగ్య సమస్యలు మరింత కష్టాలను కలిగిస్తున్నాయి. వీటిని అధిగమించడానికి అధికబరువు తగ్గించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. అవి పాటించడం వలన లాభమా నష్టమా. దీనివలన బరువు ఎంత వరకూ తగ్గవచ్చు. ఒకేసారి ఎక్కువ బరువు తగ్గవచ్చా. ఇవన్నీ మనల్ని వేధించే అనుమానాలు. వీటినుండి బయటకు రావడానికి ఇప్పుడు మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. 

మొదట అసలు బరువు ఎలా తగ్గాం అనేది ఎక్కువ బరువు తగ్గడం మంచిదా కాదా అని చెప్పేందుకు ఉపయోగపడుతుంది. మంచి డైట్ ఫాలో అవుతూ శరీరానికి కావలసిన పోషకాలు, ఖనిజాలు, ప్రోటీన్ సరిపడా అందిస్తూ దానికి తగిన వ్యాయామం చేస్తూ బరువు తగ్గడం వలన ఎటువంటి సమస్యలు లేవు. కానీ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఆపరేషన్తో శరీరంలోని కొవ్వును తీసేస్తారు.

 ఇలా చేయడం వలన ఒక్కోసారి అంతర్గత అవయవాలు దెబ్బతిని మరణం సంభవించవచ్చు. లేదా డైటింగ్ పేరుతో అసలు తినకుండా శరీరాన్ని ఎండబెట్టి బరువు తగ్గడం వలన కూడా అనేక  అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎవరు బరువు తగ్గాలన్నా ముందు డాక్టర్స్ సలహాతో శరీరానికి కావలసిన పోషకాలు అందేలా డైట్ను తీసుకోవాలి. అలాగే వ్యాయామం కూడా మన రోజువారీ అలవాట్లలో భాగం కావాలి. 

తిండి విషయంలో జంక్ ఫుడ్, మసాలా ఆహారం తగ్గించాలి. కనుక నడక లేదా యోగా చేరడం ప్రారంభించండి. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. మలబద్దకం రాకుండా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు,కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీలైతే పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ చేయడం వలన శరీరానికి శక్తి అందుతుంది. అంతర్గతంగా బలంగా తయారవుతారు.

 కొవ్వు శరీర అవసరాలకు సరిపడా అందడం వలన అదనపు కొవ్వు చేరదు. దీంతో అతి తక్కువ రోజుల్లోనె ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువుతగ్గుతారు. మంచి శరీర సౌష్టవంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. ఈ పద్ధతి లో బరువు తగ్గడం వలన స్టామినా పెరగడంతో పాటు మళ్ళీ వెంటనే బరువు పెరుగుతారనే భయం ఉండదు.

Leave a Comment

error: Content is protected !!