how to stop drinking alcohol medicine

తాగుబోతులు పూర్తిగా తాగుడు మానేస్తారు….. మద్యం షాప్ వైపు అసలు చూడరు, వెళ్లరు, తాగరు

ప్రస్తుత కాలంలో అనేకమంది వాళ్ల ఇళ్లల్లో ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య తాగుడు. దీని ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అనేకమంది అప్పుల్లో కూరుకు పోతున్నారు. ఇది ప్రతి ఇంట్లో ఉంటున్న సమస్య. దీనికోసం ఎన్నో రిహాబిలిటేషన్ సంస్థలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని రోజులు మానివేసి మరలా మద్యం వైపు మొగ్గుచూపుతున్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించిన ఆ వ్యసనం నుంచి బయటపడలేకపోతు ఉన్నారు. దీని నుంచి విడుదల పొందడానికి ఆయుర్వేదంలో ఉపయోగించే ఒక మంచి రెమిడి నీ ఇప్పుడు మనం తయారు చేసుకుందాం.

దీనికోసం మనం కరక్కాయలను ఉపయోగించుకోవాలి. వీటిలో చిన్న సైజు కరక్కాయలను తీసుకోవాలి. పెద్దవి తీసుకుంటే అవి పాడై పోయే అవకాశం ఉంటుంది. దీనికోసం 3 కరక్కాయలను తీసుకోవాలి. వాటిని రోటిలో వేసుకొని పగలగొడితే అందులో తెల్లటి విత్తనం ఉంటుంది‌. దానిని తీసివేసి కరక్కాయలను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక పావు టీ స్పూన్ ఒక గ్లాస్ లోనికి తీసుకోవాలి. అందులో పది టీ స్పూన్ల నీళ్లను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన కషాయాన్ని రోజు ఉదయం టిఫిన్ చేసినా ఆర గంట తరువాత మద్యం సేవించే వారికి ఇవ్వాలి.

ఇలా క్రమం తప్పకుండా 60 రోజుల పాటు సేవిస్తే మద్యం జోలికి వెళ్లారు. వీటిని రాత్రి సమయంలో కానీ మధ్యాహ్నం భోజనం తర్వాత కాని తీసుకోకూడదు. కరక్కాయ పొడి బయట ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. కానీ బయట వాటిల్లో కలుషితాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన పొడిని ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఈ 60 రోజుల్లో ఒక్క రోజు కూడా ఈ కషాయం తీసుకోవడం మానకూడదు. ఒకవేళ మధ్యలో ఆపితే దీని వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు.

కరక్కాయ విలువైన ఔషధాలను కలిగి ఉంటుంది. వీటిలో యాంత్త్రీక్వినోన్లు, టానిన్లు, ఛెబ్యులిక్ ఆమ్లం, రెసిన్, స్థిర తైలాలను కలిగి ఉంటుంది. ఇవి అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి. ఆస్తమా, దగ్గు, వాంతులు, కంటి వ్యాధులు, గుండె సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. దగ్గు నివారణకు కరక్కాయ ఉపయోగించడం ఇంటి పద్ధతి. కనుక ఈ కరక్కాయ ఎన్నో రకాల వ్యాధులను నివారించడంతో పాటు మద్యం వ్యసనం నుండి విడుదల అందిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!