వర్షాకాలంలో జుట్టు కుదుళ్ళు బలహీనపడి జుట్టు రాలే సమస్య ఎక్కువగా అవుతుంది. దీనిని నివారించడానికి సహజంగా పాటించే కొన్ని చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. వర్షాకాలంలో స్టార్టింగ్‌లోనే ఇలాంటి చికిత్సలు పాటించడం వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువ కాకుండా నివారించవచ్చు. దాని కోసం తీసుకోవాల్సిన చిట్కాలు చాలా చిన్నవి, సులభమైనవి. మొదట జుట్టుకి మసాజ్ చేయాలి. దాని కోసం ఒక గిన్నెలో రెండు స్పూన్ల కొబ్బరి నూనె, ఒక స్పూన్ ఆముదం కలిపి పెట్టుకోవాలి.
కొబ్బరినూనె బదులు బాదం నూనె కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఒక విటమిన్ ఈ కాప్సుల్ వేసుకోవాలి. ఈ నూనెను ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని దానిలో చిన్న గిన్నెతో పెట్టుకొని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న నూనెను తలస్నానం చేసిన తలకు బాగా పట్టించాలి. కుదుళ్లకు బాగా పట్టేలా చేతి వేళ్ళను ఉపయోగించి కుదుళ్ళకు బాగా మర్ధన చేయాలి.
ఇలా చేయడం వలన మన తలలోని చర్మానికి రక్తప్రసరణ మెరుగవుతుంది. జుట్టు బలహీనపడకుండా కాపాడుతుంది. ఈ నూనె పెట్టిన జుట్టును ఒక గంట అలా వదిలేసి తర్వాత ఒక గిన్నెలో ఒక గుడ్డులోని పసుపు, తెలుపు భాగాలను తీసుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆముదం, ఒక రెండు స్పూన్ల పెసరపిండి కలుపుకోవాలి. పచ్చి పగసలను పిండి పట్టించుకుని వాడుకోవాలి. పెసరపిండి అందుబాటులో లేకపోతే శెనగపిండి కూడా వాడుకోవచ్చు.
తర్వాతి ఈ ప్యాక్‌ని బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుంచి బాగా అప్లై చేసుకోవాలి. దీన్ని తలలోనే 40 నిమిషాల పాటు ఆరనిచ్చి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం ఒక సారి చేయడం వల్ల జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు. జుట్టుకు కావలసిన పోషకాలన్నీ అంది బలమైన, దృఢమైన జుట్టును పొందవచ్చు. పెసలు, గుడ్డులో ఎన్నోరకాల పోషకాలుంటాయి. జుట్టును బలహీనపడకుండా కుదుళ్ళనుండి బలంగా చేస్తాయి. జుట్టు మృదువుగా కండిషన్లో ఉండేలా చేస్తాయి.