నల్లని ఒత్తెన జుట్టు ప్రతి ఒక్కరికి కలగా మారిపోతుంది నేటి రోజుల్లో. ప్రతిఒక్కరి నోట ఎక్కువగా వినిపిస్తున్న మాట జుట్టు రాలిపోతుంది. జుట్టు పలచబడి తమని తామే తక్కువగా చూసుకుంటున్న తరుణంలో వాటికి కారణాలేంటో తెలుసుకుందాం.
వేడి:- చాలామందికి వేడివేడి నీళ్ళతో చేస్తేనే కానీ స్నానం చేసినట్టుండదు. అలా చేయడం వలన జుట్టు డ్యామేజ్ అవుతుంది. అంతేకాకుండా హెయిర్ డైయర్లు, ఎండవేడి కూడా జుట్టును పాడుచేస్తుంది.
షాంపూలు:- మనం ఉపయోగించే షాంపూలలో ఉండే కెమికల్స్ మన జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి. అందుకే షాంపూలు వాడేముందు అందులో ఏమైనా ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయోమో చూసి మార్చుకోండి. ఎక్కవగా హెయిర్ జెల్స్ లాంటివి వాడకుండా చూసుకోండి.
తడిజుట్టు :- తడిజుట్టును ఎక్కువగా రుద్దడం లేదా దువ్వడం కూడా జుట్టు బలహీనపడడానికి కారణమవుతుంది. జుట్టును మరీ బిగుతుగా కట్టడం వలన కూడా జుట్టు పలచబడే సమస్య వస్తుంది. బిగించడం వలన కుదుళ్ళు బలహినపడేందుకు కారణమవుతుంది.
ఒత్తిడి :- ఒత్తిడి వలన కూడా జుట్టు రాలిపోతుంది.
రక్తప్రసరణ:- రక్తప్రసరణ వలన న్యుట్రియంట్స్ శరీర అవయాలకు అందుతాయి. అలాంటి రక్తప్రసరణ తలకి బాగా అందాలంటే వారంలో రెండుసార్లు అయిన నూనెతో మసాజ్ చేయాలి. నూనెల్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కృత్రిమవాసనలు లేని స్వచ్ఛమైన నూనెతో సర్క్యులర్ మోషన్తో మసాజ్ చేసుకోండి. ఎక్కువగా చేయడంవలన జుట్టు తెగిపోయే అవకాశం ఉంటుంది కనుక మృదువుగా చేయండి.
వ్యాయామం:- వలన రక్తప్రసరణ మెరుగుపరిచి జుట్టు ఆరోగ్యానికి కారణమవుతాయి.స్త్రీల లో హార్మోన్లు అదుపుతప్పడం వలన కూడా జుట్టు రాలుతుంది. పురుషులలో Dht హార్మోన జుట్టు ఊడిపోవడానికి,కొత్త జుట్టు రాకుండా అడ్డుకుంటుంది. మన ఆహారం లో కొద్దిపాటి మార్పులతో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మెంతులు, నానబెట్టిన నాలుగైదు బాదాంలు, అరటిపళ్ళు, కారట్స్ , పుట్టగొడుగులు dat హార్మోన్ల ను తగ్గిస్తాయి. టెస్టోస్టిరాన్ హర్మోన్ ఇంజక్షన్ వలన కూడా బట్టతల వస్తుంది.
పోషకాలు :- మనం తినే ఆహారంలో పోషకాల లోపం వలన శరీరంలో ముఖ్యమైన అవయవాలకు పోషకాలను అందివ్వడంలో భాగంగా జుట్టుకు తగ్గుతాయి. అందుకే తినే ఆహారంలో శరీరానికి సరిపడా పోషకాలు ఉండేలా చూసుకోవాలి. జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు అవసరం. విటమిన్ ఎ, ఇ, కే జీడిపప్పు, బాదం, వేరుశనగలలో పుష్కలంగా ఉంటాయి. దేశీ ఆవునెయ్యి , పప్పులలో ఆరోగ్యానికి అవసరమయ్యే కొవ్వులు ఉంటాయి. ఐరన్, విటమిన్ సి ఉండేలా ఆకుకూరలు ,సిట్రస్ ప్రూట్స్ తినాలి.
ఇవన్నీ తీసుకుంటూ జీవనవిధానాన్ని సరిచేసుకోవడం వలన జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.