ఆడవారికి ఎక్కువ మొహం పై, గడ్డం పై, పై పెదవి పైన అవాంఛిత రోమాలు ఎక్కువగా వస్తుంటాయి. అవాంఛిత రోమాల నలుగురిలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వీటిని పోగొట్టుకోవడానికి పార్లర్ కి వెళ్ళి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడతారు. ఈజీగా ఇంట్లోనే ఈ చిట్కా ఉపయోగించి అవాంఛిత రోమాలు తొలగించుకోవచ్చు. కేవలం రెండు పదార్దాలు ఉపయోగించి ఈ చిట్కా తయారుచేసుకోవచ్చు.
ఈజీగా అవాంఛిత రోమాలు తొలగించుకోవడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా రెండు నిమ్మకాయలు తీసుకుని రసం తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని రెండు చెంచాల నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక చెంచాకి రెండు చెంచాలు నిష్పత్తిలో పంచదార వేసుకోవాలి. అంటే ఇప్పుడు రెండు చెంచాల నిమ్మరసానికి నాలుగు చెంచాల పంచదార వేసి స్టవ్ ఆన్ చేసి తీగ పాకం వచ్చేంతవరకు మరగనివ్వాలి.
తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారకూడదు గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా ఉన్నపుడే అవాంఛిత రోమాలు ఉన్న భాగంలో అప్లై చేయాలి. అప్లై చేశాక దళసరిగా ఉన్న క్లోత్ తీసుకుని దానిపై అంటించుకోవాలి. దళసరిగా ఉన్న క్లాత్ మాత్రమే తీసుకోవాలి పలుచగా ఉండకూడదు. బాగా అంటిన తర్వాత అప్లై చేసిన పొసిషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో క్లాత్ ని పట్టుకుని ఒక్కసారిగా లాగాలి. మధ్యలో ఆపడం స్లో గా తీయడం చేయకుండా ఒక్కసారిగా లాగాలి.
మీరు అప్లై చేసిన భాగంలో ఉన్న అవాంఛిత రోమాలు అన్ని వచ్చేస్తాయి.ఒకసారి ఇలా అవాంఛిత రోమాలు తొలగిస్తే మళ్లి ఒక నెల వరకు రావు. ఇలా నెలకి ఒకసారి చేస్తే సరిపోతుంది. దీనికోసం పార్లర్కి వెళ్లి గంటలకొద్దీ కూర్చుని వేలకు వేలు పోయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా ఈ రెండు పదార్దాలతో ఎప్పటినుండో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అవాంఛిత రోమాలు తొలగించుకోవచ్చు. దీనికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు.
తక్కువ ఖర్చుతో అవాంఛిత రోమాలు తొలగించుకోవచ్చు. దీనిలో ఎలాంటి కెమికల్స్ వాడలేదు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. ఈ ఈజీ చిట్కా ఇంట్లోనే తయారు చేసి ట్రై చేయండి మంచి రిసల్ట్ కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు కూడా ఈ చిట్కా ట్రై చేసి చూడండి.