మీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్న గదిలో కూర్చున్నారు. అకస్మాత్తుగా, మీ కడుపు బిగ్గరగా శబ్దం చేస్తుంది. దీనిని బోర్బోరిగ్మి అని పిలుస్తారు మరియు ఆహారం, ద్రవం మరియు వాయువు ప్రేగుల గుండా వెళుతున్నప్పుడు సాధారణ జీర్ణక్రియ సమయంలో ఇది సంభవిస్తుంది.
బోర్బోరిగ్మి ఆకలితో కూడా సంబంధం కలిగి ఉంటుంది, ఇది జీర్ణశయాంతర (GI) మార్గంలో సంకోచాలను ప్రేరేపించే హార్మోన్ల స్రావానికి కారణమవుతుందని భావించబడుతుంది. కొన్నిసార్లు ఈ శబ్దం చాలా గట్టిగా కూడా వస్తుంది. అసంపూర్ణ జీర్ణక్రియ, నెమ్మదిగా జీర్ణం అవ్వడం మరియు కొన్ని ఆహారాలను తీసుకోవడం వంటివి బోర్బోరిగ్మికి దోహదం చేస్తాయి. ఇది ఒక సాధారణ విషయం.
అదృష్టవశాత్తూ, మీ పొట్టను శబ్దం చేయకుండా ఆపడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
1.నీళ్లు తాగండి. మీరు తినలేని చోట ఉంటె, మీ కడుపు ఆకలికి శరీరంలో జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతున్నప్పుడు ఇలా శబ్దం వస్తుంది ఆహారం అందుబాటులో లేకపోతే నీరు త్రాగడం దానిని ఆపడానికి సహాయపడుతుంది.
2. నెమ్మదిగా తినండి. ఆహారం అతి త్వరగా తినడం వలన ఆహారంతో పాటు గాలి కూడా పొట్టలోకి చేరుతుంది అలాగే ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి జరగవలసి అవుతుంది ఇలా జరగడం వలన శరీరంలో చేరిన శబ్దాలను చేస్తుంది
3. క్రమం తప్పకుండా ఆహారం తినండి. కొంతమంది సమయానుకూలంగా ఆహారం తింటూ ఉంటారు ఇలా తినడం వలన శరీరంలో గ్యాస్ ఉత్పత్తి జరిగి ఇది పొట్టలో అటు ఇటూ కదులుతూ ఉంది నిర్లక్ష్యం చేస్తే ఇది జీర్ణసంబంధ సమస్యలకు కారణం అవుతుంది కనుక సమయానికి ఆహారం తీసుకోవాలి
4. నెమ్మదిగా నమలండి. ఆహారం సగం నోటిలోనే జీర్ణం అవ్వాలి అంటారు పెద్దలు అంటే ఆహారాన్ని బాగా నమలడం వలన కడుపులో జీర్ణరసాలు లేదా ఉపయోగం తగ్గుతుంది దీనిద్వారా ఎసిడిటీ కడుపు నుండి శబ్దాలు రావడం తగ్గుతుంది.
5. గ్యాస్-ట్రిగ్గర్ ఆహారాలను పరిమితం చేయండి. కాలీఫ్లవర్ క్యాబేజ్ మసాలాలు వంటి గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారాలను తగ్గించాలి.
6. ఆమ్ల ఆహారాలను తగ్గించండి. త్వరగా జీర్ణంకాని నీ మాంసాహారాలు ఎసిడిటీని కలిగించేవి కూల్డ్రింకులు మైదా వంటి పదార్ధాలు తగ్గించడం వలన కూడా ఈ శబ్దాలను అరికట్టవచ్చు
7.అతిగా తినవద్దు. ఆహారాన్ని ఎప్పుడూ అతిగా తినవద్దు అతిగా తినడం వలన జీర్ణక్రియ ఎక్కువగా జరగవలసి ఉంటుంది. దీని వలన గ్యాస్ , జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది.
8. మీరు తిన్న తర్వాత నడవండి. తిన్న వెంటనే ఎప్పుడు పడుకోవద్దు. దీనివలన పొట్టలో ఆహారం జీర్ణం అవ్వక గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది. కొంతసేపు నడవడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది పడుకోవడానికి రెండు గంటల ముందే ఆహారం తీసుకోవాలి.