శరీరంలో కొన్ని అవయవాలు మన పడుకున్నా అవి పడుకోకుండా 24 గంటలు పని చేస్తూనే ఉంటాయి. ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండె, లివర్, మెదడులో కొన్ని భాగాలు, పాంక్రియాస్లో కొన్ని భాగాలు రాత్రి సమయంలో కూడా పని చేస్తూ ఉంటాయి. ఇవి పడుకుంటే శరీరంలో జీవక్రియ ఆగిపోతుంది. అందుకే ఇవన్నీ 24 గంటలపాటు పని చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని వైటాల్ ఆర్గాన్స్ అంటారు. వైటల్ ఆర్గాన్స్కి రెస్ట్ ఉండదా కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటాయా అంటే లేదు వాటికి కూడా రెస్ట్ ఉంటుంది.
కాకపోతే పని చేస్తూనే మధ్యమధ్యలో రెస్ట్ తీసుకుంటాయి. రాత్రి సమయంలో పని చేస్తూనే రెస్ట్ తీసుకుంటాయి. ఇలా రెస్ట్ తీసుకోవడం వల్ల వెంటనే యాక్టివ్ గా పని చేయగలుగుతాయి. వీటి అన్నిటికీ ఎప్పుడు రెస్ట్ దొరుకుతుంది అంటే రాత్రి పడుకునే సమయానికి పొట్టలో ఆహారం లేకుండా మొత్తం జీర్ణం అయిపోవాలి. సాయంత్రం ఐదు ఆరు గంటలకు రాత్రి భోజనం నేచురల్ ఫుడ్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ వంటివి సాయంత్రం ఆరు గంటల లోపు తినేయాలి.
రాత్రి 8:30 నుండి 9 గంటలకు జీర్ణం అయిపోయి పొట్ట ఖాళీ అయిపోతుంది. పాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం కొద్ది సేపు మాత్రమే తర్వాత ఆగిపోతుంది. కాబట్టి దానికి రెస్ట్ దొరుకుతుంది. తర్వాత లివర్ ఫిల్టర్ చేయాల్సిన పని ఉండదు. హాని కలిగించే కెమికల్స్ పవర్ తగ్గించడం అంతా త్వరగా అయిపోతుంది. కాబట్టి లివర్ కూడా రెస్ట్ దొరుకుతుంది. రాత్రిపూట పొట్ట, ప్రేగులకు రక్తసరఫరా అవసరం ఉండదు కాబట్టి శరీరంలో మిగతా అవయవాలకు కూడా రక్తం సరఫరా చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి పగలంతా పని చేసి కష్టపడి ఉన్న గుండెకు రెస్ట్ తీసుకోవడానికి సమయం దొరుకుతుంది.
అంటే గుండె ఆపి రెస్ట్ తీసుకోవడం కాకుండా తక్కువ పనిచేస్తూ రెస్ట్ తీసుకుంటుంది. ఊపిరితిత్తులు కూడా పాతిక నుండి ముప్పై సార్లు కొట్టుకుంటాయి. కానీ నిద్రపోయినప్పుడు 12- 15 సార్లు మాత్రమే కొట్టుకుంటాయి. ఆహారం తీసుకుంటారు వెలిగించడానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది కాబట్టి రాత్రి సమయంలో కూడా ఊపిరితిత్తుల ముప్పై సార్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. సాయంత్రం ఆహారం ఆరు గంటల్లోపు తినేసి 8:30- 9 గంటలకు అరిగిపోతే ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉండదు.
కాబట్టి ఊపిరితిత్తులకు కూడా రెస్ట్ దొరుకుతుంది. కిడ్నీ ఫిల్టరేషన్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే రాత్రి సమయంలో మిగతా అవయవాలకు రక్త సరఫరా తక్కువగా అవసరం అవుతుంది. కాబట్టి ఫిల్టరేషన్ కూడా ఎక్కువగా అవసరం ఉండదు. కాబట్టి కిడ్నీలకు కూడా రెస్ట్ దొరుకుతుంది. త్వరగా తిని త్వరగా పడుకున్నప్పుడు గాఢ నిద్ర పడుతుంది. గాఢనిద్రలో వైటల్ ఆర్గాన్స్ కూడా రెస్ట్ తీసుకుంటాయి. ఇలా అవయవాలకు అవసరమైన రెస్ట్ ఇచ్చినట్లయితే మనం జన్మలో హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.