ముఖం, ఇతర శరీర భాగాలపై తీసుకున్నంత శ్రద్ధ కాళ్ళపై తీసుకోరు మనలో చాలామంది. దీనివలన కొంతమందిలో కాళ్ళ మడమలు పగిలి నడవలేకపోవడం, నొప్పి, దురద, అసహ్యంగా కనిపించడం ఉంటుంది.
సరిపడా నీళ్ళు తాగడపోవడం, కాళ్ళపై పేరుకున్న మృతకణాలను తొలగించకపోవడం కాళ్ళ పగుళ్ళుకు ముఖ్యకారణాలు. అధిక బరువు, ఎత్తు చెప్పులు ఎక్కువగా వాడడం వలన రక్తప్రసరణ సరిగా జరగక పోవడం, పోషకాహార లోపం కూడా పాదాల పగుళ్ళకు కారణం కావచ్చు.
కొంతమంది కి మరీ లోతుగా పగిలి నొప్పి తీవ్రంగా ఉంటుంది. అందరిలోనూ ఈ సమస్య ఉన్నా స్త్రీ లలో అధికంగా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి
అప్పుడప్పుడు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి ఆ నీటిలో కాళ్ళను నానబెట్టి పదినిమిషాల తరువాత ప్యూమిక్ స్టోన్తో తోమడం వలన మృతకణాలు తొలగిపోయి పాదాలపగుళ్ళు తగ్గుతాయి.
నువ్వుల నూనె లేదా అందుబాటులో శున్న నూనెను గోరువెచ్చగా చేసి పాదాలకు మసాజ్ చేయడంవలన రక్తప్రసరణ మెరుగుపడి పగుళ్ళ సమస్య తలెత్తదు.
బియ్యంపిండి, ఆపిల్ సిడార్ వెనిగర్, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని కాళ్ళకు పట్టించి సున్నితమైన మసాజ్ చేసి కడిగేసిన తర్వాత నూనె లేదా పుట్ మాయిశ్చరైజర్ రాయడం వలన పాదాలు మృదువుగా మారతాయి.
రాత్రుళ్ళు పడుకునేముందు పెట్రోలియం జెల్లీ రాసి సాక్సులు వేసుకుని పడుకోవడం వలన కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి.
ఒక కొవ్వొత్తిని తీసుకుని దాని మైనాన్ని తురిమి అందులో టేబుల్ స్పూన్ ఆవనూనె వేసి ఆ మిశ్రమాన్ని డబల్ బాయిలింగ్ పద్ధతిలో అంటే కొంచెం మరిగిన నీటిలో వరే గిన్నెలో ఈ మిశ్రమం ఉన్న గిన్నెను పెట్టి కరిగిస్తే మైనం నూనెలో కరిగిపోతుంది.
ఆ మిశ్రమాన్ని బాగా కలపడం వలన మంచి క్రీమీ టెక్చర్లోకి వస్తుంది. దీనిని శుభ్రంగా కడిగిన తర్వాత పాదాలకు రాయాలి. మర్దనా చేస్తూ రాయడం వలన పాదాలలో ఇంకి పాదాలను తేమను అందించి పగుళ్ళు తగ్గిస్తుంది. కనీసం పదిరోజుల పాటు ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి సాక్సులు వేసుకోవడం వలన పాదాల పగుళ్లు తగ్గిపోతాయి.