How to Treat Dandruff at Home Itchy Scalp Remedy

మీ చేతులు ఎప్పుడు తలలో ఉంటున్నయా……… చుండ్రు ఎక్కువగా ఉందా……… ఇలా చేస్తే మొత్తం క్లీన్ అవుతుంది…

 కొంతమందికి తల స్నానం చేసిన ఒకటి, రెండు రోజులకే వాళ్ళు చేయ్యి తల మీదకు వెళ్లి దురద పుడుతూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే మనం రోజుకు రెండుసార్లు స్నానం చేసి అవయవాలను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కానీ తల స్నానం చేయడానికి మాత్రం వారానికి ఒకసారి అని పెట్టుకుంటాం. ఈ వారం మొత్తం వాతావరణం లో ఉన్న పొల్యూషన్, మరియు తలలో చెమటలు పట్టడం, తలలో ఉండే చర్మం మృతకణాలు కూడా తలపై ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతాయి. వీటి వలన తలలో ఇన్ఫ్లమేషన్ మొదలై తలలో దురద పెడుతుంది.

                             ఈ దురదను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల కెమికల్ సహిత ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటున్నాం. వీటి వలన ఇంకా జుట్టుకి నష్టం కలుగుతుంది కానీ ఎటువంటి ఫలితం ఉండదు. అంతేకాకుండా చాలా రకాల హోమ్ రెమెడీస్ ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వలన కూడా కొంచెం గా మాత్రమే ఫలితం ఉంటుంది. కానీ శాశ్వత పరిష్కారం లభించదు. అంతేకాకుండా తలలో విడుదలయ్యే టాక్సీన్స్, బయట వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ లు కూడా వీటితో కలిసి దురదకు కారణం అవుతాయి. ఇటువంటి దురదలు తగ్గాలంటే శాశ్వత పరిష్కారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

                              మనం రోజుకు రెండుసార్లు ఒంటికి స్నానం చేస్తూ ఉంటాం. ఇలా రెండుసార్లు చేసేటప్పుడు ఒకసారి తలరా స్నానం చేయడం ఒక నియమంగా పెట్టుకోవాలి. తలార స్నానం చేసేటప్పుడు జుట్టు మీద పది వేలు పెట్టుకుని తల స్నానం చేయడంతో పాటు, మాడు భాగంలో కూడా పదివేల తో బాగా రుద్దుకుంటూ తల స్నానం చేయాలి. ఈ టెక్నిక్ ను ఉపయోగిస్తూ రోజు తల స్నానం  చేస్తే తలలో దురదలు వచ్చే అవకాశం ఉండదు. దీనివలన  తలలో వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది. తద్వారా క్రిములు చేరే అవకాశం మీరు ఇచ్చినట్లు అవ్వదు.

                             కనుక ఎన్ని ఉపయోగించిన తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది గాని శాశ్వత పరిష్కారం లభించడం లేదు అని అనుకునేవారు ఈ పద్ధతిని ఉపయోగిస్తే మంచి ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా జుట్టు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మరియు దీనికోసం ఎటువంటి ప్రొడక్ట్స్ ఉపయోగించకపోవడం వలన దుష్ఫలితాలు కూడా ఉండవు. చుండ్రు వంటి సమస్యలు కూడా ఎదుర్కొనే అవసరం ఉండదు…

Leave a Comment

error: Content is protected !!