ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వలన ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్య ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం రకరకాల ఇంగ్లీష్ మందులను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు. ఇంగ్లీష్ మందులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారు బాత్రూం లో గంటల తరబడి కూర్చోవడం, ముక్కడం, మూలగడం వంటివి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ విరోచనం అవ్వదు.
మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి సాఫీగా విరోచనం అవ్వాలంటే ఈ చిట్కా ట్రై చేసి చూడండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కరక్కాయలు ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. కరక్కాయలను రాయితో పగులగొట్టుకుని గింజలు తీసి పడేసి ముక్కలు మాత్రమే తీసుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి చాలా మెత్తగా ఉండాలి. మెత్తగా లేదు అనిపిస్తే ఒకసారి జల్లెడ పట్టుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఒక గ్లాసు వేడి వేడి నీళ్ళు తీసుకొని ఒక చెంచా ఈ పౌడర్ ను కలిపి ప్రతి రోజు తీసుకోవడం వలన విరోచనం సాఫీగా అవుతుంది.
ఈ డ్రింక్ రాత్రి పడుకోవడానికి ఒక అరగంట ముందు తీసుకోవాలి. ఈ డ్రింక్ తాగేటప్పుడు టీ తాగినట్లు గా కొంచెం కొంచెంగా చప్పరిస్తూ తాగాలి. ఈ కరక్కాయ పొడిని పాలల్లో లేదా నీళ్లలో ఎలాగైనా సరే కలిపి తీసుకోవచ్చు. కరక్కాయలు మలబద్ధకం సమస్యను తగ్గించడం లో దివ్యౌషధంలా గా పనిచేస్తాయి. ఎన్ని మందులు ఉపయోగించిన అసలు ప్రయోజనం లేదు అనుకున్న వారు ఒకసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. ప్రతి రోజు ఈ డ్రింక్ తాగడం వలన విరోచనం సాఫీగా అవుతుంది. ముక్కడం, మూలగడం, బాత్రూం లో గంటల తరబడి కూర్చోవడం వంటి సమస్య ఉండదు.
ఈ డ్రింక్ తాగడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది నేచురల్ చిట్కా కాబట్టి దీనిని అన్ని వయసుల వారు ఉపయోగించుకోవచ్చు. మలబద్దకం సమస్యతో బాధపడేవారు తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగాలి. కారం, మసాలాలు తినకూడదు. ఈ డ్రింక్ తాగుతూ ఈ ఆహార నియమాలు పాటించినట్లయితే మలబద్దకం సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి రకరకాల మందులు ఉపయోగించిన ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్నవారు ఒక సారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. చాలా బాగా పనిచేస్తుంది.