ఆపిల్ సిడార్ వెనిగర్ ఈ మధ్య కాలంలో బరువు తగ్గాలి అనుకునేవాళ్ళ దగ్గర ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఆపిల్ సిడార్ వెనిగర్ అంటే ఆపిల్ నుంచి తీసిన జ్యూస్ ను పులియబెట్టే పద్దతిలో తయారు చేస్తారు. ఆపిల్ సిడార్ వెనిగర్ వలన అనేక ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అతి సర్వత్రా వర్జయేత్ అనేది మనందరికీ తెలిసినదేగా. ఇప్పుడు ఆపిల్ సిడార్ వెనిగర్ వలన ఉండే లాభనష్టాలు తెలుసుకుందాం.
ఆపిల్ సిడార్ వెనిగర్ వలన లాభాలు :- బరువు తగ్గడానికి ఇది చాలా బాగా పని చేస్తుంది. ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఇది తాగాకా చాలాసేపు పొట్ట నిండుగా అనిపించడం వలన జంక్ తినకుండా మనల్ని నిరోధిస్తుంది. అంతేకాకుండా షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ రోగులకు ఇన్సులిన్ ని సక్రమంగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. పొట్టచుట్టూ ఉండే కొవ్వును కరిగించడంలో ప్రముఖంగా పనిచేసి బరువుతగ్గడంలో త్వరగా ఫలితాలు చూపిస్తుంది. అంతేకాకుండా ఆహారం ద్వారా శరీరంలో చేరే బ్యాక్టీరియాను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
నష్టాలు :- ఆపిల్ సిడార్ వెనిగర్(ఎసిడిక్ యాసిడ్) తీసుకోవడం వలన పళ్ళపై ఉండే ఎనామిల్ పొర కరిగిపోయే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా తీసుకోవడం వలన, ఎక్కువ రోజులు తీసుకోవడం వలన శరీరంలో పొటాషియం తగ్గుతుంది. మెదడు పనితీరుకు పొటాషియం చాలా అవసరం. అలాగే శరీరంలో ఉండే కాల్షియంతో చర్య జరిగి ఎముకలు పెలుసుగా తయారవుతాయి. అలాంటప్పుడు త్వరగా ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఆకలి తగ్గడం వలన శరీరానికి కావలసిన ఆహారం అందక శరీరంలో విటమిన్ లోపం ఏర్పడి జుట్టు రాలడం, నీరసం, చర్మంపై తెల్లటి మచ్చలకు కారణమవుతుంది. డయాబెటిస్ ఉన్నవారు, కిడ్నీల సమస్యలకు వాడే మందులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కొంతమందిలో ఎలర్జీలకు కూడా కారణమవుతుంది.
తీసుకునే పద్దతి :- ఆపిల్ సిడార్ వెనిగర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళలో బాగా కలిపి పంటికి తగలకుండా తీసుకోవచ్చు. రుచి నచ్చనపుడు ఏదైనా జ్యూస్ లో కలిపైనా తాగవచ్చు. దీనిని పరిమితంగా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం మొత్తంగా రోజులో మూడుసార్లుగా 30ml వరకూ తీసుకోవచ్చు. ఏదైనా శరీరానికి నప్పింది, లేనిది చూసుకుని వీలైతే డాక్టర్ సలహాతో వాడడం మంచిది. ఆపిల్ సిడార్ వెనిగర్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.