పండుగ సీజన్ వచ్చిందంటే చాలు అందరూ అందంగా, స్పెషల్ గా కనిపించడం కోసం రకరకాల ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది పార్లర్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఈ చిట్కాలు ట్రై చేస్తున్నట్లయితే మీ ఫేస్ గ్లోగా, తెల్లగా మెరిసిపోతుంది దీని కోసం ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. కేవలం ఐదు నిమిషాల్లో మీ స్కిన్ తెల్లగా మెరిసిపోతుంది.
దీని కోసం ముందుగా ఫేస్ కి స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ కోసం ఒక టమాటో తీసుకొని మధ్యలో కట్ చేసుకుని దాని మీద ఒక చెంచా పంచదారని వేసుకొని అర చెంచా ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకొని ముఖం మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. టమాటో వద్దు అనుకున్న వాళ్లు నిమ్మకాయ, బీట్రూట్, క్యారెట్ లేదా బంగాళదుంప ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇవేమీ వద్దు అనుకున్న వాళ్లు పంచదార, ఫెయిర్ అండ్ లవ్లీ, కొంచెం తేనె వేసి స్క్రబ్ చేసుకోవచ్చు.
స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడం ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనకు కావలసింది ఉడికించిన అన్నం ఒక కప్పు, రెండు చెంచాలు మినపగుళ్ళు, ఒక చిన్న టీ గ్లాస్ బీట్రూట్ జ్యూస్. మిక్సీలో మినపగుళ్ళు ముందుగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత అన్నం కూడా వేసుకోవాలి. అన్నం మరియు మినప గుళ్ళు ఒకసారి వేస్తే మినప గుళ్లు మెత్తగా అవ్వవు. అందువల్ల ముందు మినప గుళ్లను పౌడర్ చేసుకున్న తర్వాత మాత్రమే అన్నం వేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
మిశ్రమాన్ని ఒక బౌల్ లో తీసుకుని దీనిలో అర చెంచా పెయిర్ అండ్ లవ్లీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్యాక్ స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాని మీదనే అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్ అప్లై చేసి ఐదు నిమిషాల పాటు ఉండనివ్వాలి. ఎక్కువ సమయం ఉంచాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. కడిగిన వెంటనే తేడా మీరే గమనిస్తారు. ముఖం తెల్లగా లైట్ పింక్ కలర్ లోకి మారుతుంది. ఈ ప్యాక్ 100% రిజల్ట్ ఉంటుంది. బీట్రూట్ జ్యూస్ వద్దు అనుకున్న వాళ్లు ఆరెంజ్ లేదా క్యారెట్ జ్యూస్ లేదా లెమన్ జ్యూస్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ చిట్కాను మీరు కూడా పండుగ సమయంలో ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.